AP Inter Supply Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..!
- By Gopichand Published Date - 04:54 PM, Wed - 26 June 24

AP Inter Supply Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supply Results) విడుదలయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి resultsbie.ap.gov.inలో BIEAP ఇంటర్ 1వ సంవత్సరం సప్లై ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జూలై 1 నుంచి వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇంటర్ సప్లై ఫలితాల ప్రకటన కోసం BIEAP ఎలాంటి విలేకరుల సమావేశాన్ని నిర్వహించకుండానే నేరుగా వెబ్ సైట్‌లోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.
మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేయండిలా
- బోర్డ్ ఫలితాల వెబ్‌సైట్‌కి వెళ్లండి. ( resultsbie.ap.gov.in)
- హోమ్ పేజీలో ఇవ్వబడిన సాధారణ లేదా వొకేషనల్‌కి సంబంధించిన IPASE 1వ సంవత్సరం ఫలితాల లింక్‌ను క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ చేయండి.
- ఫలితాన్ని తనిఖీ చేసి, డౌన్‌లోడ్ చేయండి.
Also Read: Pawan : ఇదే కదా మీము కోరుకుంటుంది..పవన్ నిర్ణయాలకు ప్రజలు ఫిదా..!!
ఈ ఏడాది మే-జూన్‌లో ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష మే 24న ప్రారంభమై జూన్ 1న ముగిసింది.మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం మొత్తం 5,03,459 మంది అభ్యర్థులు BIEAP 1వ, 2వ సంవత్సరం IPASE పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,65,872 మంది IPASE 1వ సంవత్సరం, 1,37,587 IPASE 2వ సంవత్సరానికి చెందినవారు. 1వ సంవత్సరం రెగ్యులర్ కోర్సులో 1,77,012 మంది బాలురు, 1,69,381 మంది బాలికలు నమోదు చేసుకున్నారు.
We’re now on WhatsApp : Click to Join