AP Assembly Session : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. మధ్యలోనే వైసీపీ వాకౌట్
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలకు ప్రసంగిస్తూ, గత ప్రభుత్వం పనితీరు పై విమర్శలు చేశారు. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. అయితే, గవర్నర్ ప్రసంగం ప్రారంభమయ్యే సరికి వైసీపీ సభ్యులు నిరసన ప్రకటిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
- By Kavya Krishna Published Date - 10:35 AM, Mon - 24 February 25

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు సభలో నినాదాలు ప్రారంభించారు. దీంతో సభలో నిరసనల మధ్య గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది గవర్నర్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారని అబ్దుల్ నజీర్ అన్నారు. అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైందని ఆయన ప్రసంగంలో అన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని తన ప్రసంగంలో వెల్లడించారు గవర్నర్ నజీర్.
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా.. అభిమానులకు షాక్ తప్పదా?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని, 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు అబ్దుల్ నజీర్. పెన్షన్లు రూ.4 వేలకు పెంచామని, మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని గవర్నర్ నజీర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలను తొలిరోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వైసీపీ సభ్యులు వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ కాసేపు నినాదాలు చేశారు వైసీపీ సభ్యులు.. ఆ తర్వాత వైసీపీ సభ్యులు అంసెబ్లీ నుంచి వాకౌట్ చేశారు..
Samantha : ఫోన్ కి దూరంగా ఉన్న సమంత.. ఆ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ నచ్చాయట..