Another leopard: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. ఇప్పుడు చిక్కింది ఐదో చిరుత..!
తిరుమల (Tirumala) నడకదారిలో మరో చిరుత (Another leopard) చిక్కింది. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి చిక్కింది.
- By Gopichand Published Date - 07:26 AM, Thu - 7 September 23

Another leopard: తిరుమల (Tirumala) నడకదారిలో మరో చిరుత (Another leopard) చిక్కింది. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి చిక్కింది. నరసింహ స్వామి ఆలయం, 7వ మైలు మధ్య ఇటీవల చిరుత సంచారాన్ని ట్రాప్ కెమెరాలో గుర్తించిన అధికారులు బోనుని ఏర్పాటు చేసి చిరుతను బంధించారు. ట్రాప్ కెమరాలో కనిపించడంతో అప్రమత్తం అయిన టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకునేందు బోనును ఏర్పాటు చేశారు. గత రాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక మార్గంలో ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత రెండు నెలల కాలంలో మొత్తం 5 చిరుతలను అధికారులు బంధించారు.
Also Read: Kushi Record : తమిళనాడులో ఈ ఇయర్ హయ్యెస్ట్ గ్రాసర్ తెలుగు మూవీగా “ఖుషి” రికార్డ్..
చిరుతల సంచారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వాటిని కట్టడి చేయడంపై టీటీడీ దృష్టి సారించింది. చిరుతల సంచరాన్ని నిరోధించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుమల కాలినడక మార్గంలో బోన్లు ఏర్పాటు చేశారు. అయితే నడకదారిలో వన్యమృగాలు సంచరించడంతో అలిపిరి మార్గంలో భక్తులు తగ్గినట్లు సమాచారం.