Minor Girl: ఏపీలో మరో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా మాదిగ వెంకటేశ్వర్లు (35) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కామాంధుడు వెంకటేశ్వర్లు దేహశుద్ధి చేసి వారి ఇంటిని పెట్రోల్ పోసి మైనర్ బాలిక బంధువులు దాడి చేశారు.
- Author : Gopichand
Date : 06-12-2024 - 9:03 IST
Published By : Hashtagu Telugu Desk
Minor Girl: ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై (Minor Girl) ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కామాంధుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అతని కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం చెల్లెలిచెలిమా గ్రామంలో మైనర్ బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేసి పరుగులు తీసింది బాలిక. తమ ఇంటి సమీపంలో పాలను తీసుకుని ఇంటికి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
Also Read: Earthquake Hits California: కాలిఫోర్నియాను వణికించిన భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!
మైనర్ బాలిక తల్లిదండ్రులు విషయాన్ని ఆరా తీయగా మాదిగ వెంకటేశ్వర్లు (35) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని మైనర్ బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. కామాంధుడు వెంకటేశ్వర్లు దేహశుద్ధి చేసి వారి ఇంటిని పెట్రోల్ పోసి మైనర్ బాలిక బంధువులు దాడి చేశారు. కామాంధుడు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు.
దేహశుద్ధి అనంతరం వెంకటేశ్వర్లు అక్కడి నుండి పరారయ్యారు. హుటాహుటిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీస్తున్నారు. మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కామాంధుడిపై మైనర్ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీస్ బలగాలు మొహరించారు. ఇటీవల కాలంలో ఏపీలో ఇలాంటి దారుణాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఏదో ఒక్క మారుమూల ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇప్పటికే హోం శాఖ మంత్రి ఇలాంటి ఘటనలు పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.