HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Chief Minister Chandrababu Naidu On A Five Day Davos Tour

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్‌ టూర్!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-12-2025 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-జీరో పావర్టీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు సంబంధించి సీఎం షెడ్యూల్‌ కూడా ఖరారైంది. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌‌లో పర్యటిస్తారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటుగా ముఖ్యమంత్రి సెక్రటరీ కార్తీకేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఐటీశాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్‌లు కూడా దావోస్ వెళుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దావోస్‌ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల్ని కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి.. పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. పలువురు ప్రముఖలతో ఆయన సమావేశమయ్యారు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.. ఇప్పుడు అక్కడ కుదుర్చుకున్న ఎంవోయూలను అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా, ఆయా జిల్లాల వారీగా భూముల కేటాయింపుతో పాటుగా ఇతర అనుమతులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు, పరిశ్రమలు శంకుస్థాపనకు కూడా సిద్ధమవుతున్నాయి.

మరోవైపు పీ4-జీరో పావర్టీపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. పీ4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సమీక్ష చేశారు. పీ4 సర్వేలో వైద్యసాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాల పెంపుపై సాయం కోరిన బంగారు కుటుంబాలు వంటి అంశాలపై చర్చించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • CM Chandrababu Davos Tour
  • World Economic Forum 2026

Related News

Richest Ministers

టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

ఈ జాబితాలో మంగళ్ లోధా, జ్యోతిరాదిత్య సింధియా మాత్రమే ఉత్తర భారతీయులు కాగా, మిగిలిన ఎనిమిది మంది సభ్యులు దక్షిణ భారతదేశానికి చెందినవారే.

  • TDP MLA Chadalavada Aravinda Babu

    Chandrababu Naidu: టీడీపీ ఎమ్మెల్యే అరవింద బాబు తీరుపై చంద్రబాబు సీరియస్

  • Chandrababu Naidu

    Cm Chandrababu Naidu: చరిత్ర నిన్ను క్షమించదు జగన్: చంద్రబాబు

  • Vijayasai Reddy about amaravati

    Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Shocking Incident In Macherla

    మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం

Latest News

  • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

  • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

  • Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!

  • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

Trending News

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

    • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

    • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd