Pawan Kalyan: ఏపీలో అర్థరాత్రి హైడ్రామా.. పోలీసులు వాహనంలోనే మంగళగిరికి చేరుకున్న పవన్..!
విజయవాడ జగ్గయ్య పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్తుండగాఆయనను గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
- By Gopichand Published Date - 06:28 AM, Sun - 10 September 23

Pawan Kalyan: విజయవాడ జగ్గయ్య పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్తుండగాఆయనను గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పవన్ నడిచి మంగళగిరి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. పోలీసులు ముందుకు వెళ్లనివ్వకపోవడంతో పవన్, పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే పడుకున్నారు. పోలీసులు ఆయనతో కాసేపు వాదించారు దింతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని అనుమంచిపల్లిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ వాహనంలో పవన్, నాదెండ్ల మనోహర్ ని అక్కడి నుంచి తరలించారు.
https://twitter.com/TeluguDz/status/1700674216562135347
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఎట్టకేలకు మంగళగిరికి చేరుకున్నారు. వారిని పోలీసులు తమ వాహనంలోనే అక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టారు. జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పవన్ కు స్వాగతం పలికారు. వారికి అభివాదం చేసిన అనంతరం ఆయన లోపలికి వెళ్లిపోయారు. కాగా, ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి వద్ద పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Chandrababu Arrest: రోడ్డుపై పడుకున్న పవన్ కళ్యాణ్.. తీవ్ర ఉద్రిక్తత
చంద్రబాబును అరెస్టు చేస్తారని తామేమీ ముందుగా ఊహించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. వారాహి యాత్ర తదుపరి షెడ్యూల్ కోసం ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసుకున్నామన్నారు. అనుమంచిపల్లి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘జగన్ ఓ క్రిమినల్.. విదేశాలకు వెళ్లాలన్నా కోర్టు అనుమతి కావాలి. అలాంటి వాడి చేతిలో అధికారం ఉండటం దురదృష్టం. సీఎం ఎప్పుడూ జైలు గురించే ఆలోచిస్తారు’ అని మండిపడ్డారు.
అంతేకాకుండా గూండాలకు అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను విజయవాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై పవన్ స్పందించారు. ‘విమానంలో ఎక్కనివ్వలేదు, కారులో వెళ్తానంటే ఒప్పుకోలేదు. నడిచి వెళ్తానంటున్నా అనుమతివ్వలేదు. గూండాలు, దోపిడీ చేసేవారికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో G20 సమ్మిట్ జరుగుతున్న టైంలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రధాని స్ఫూర్తికి విరుద్ధం. ఈ సీఎం బెయిల్ మీద బయట ఉన్నారు. అందుకే ఆయనకు అరెస్ట్ ఆలోచనలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.