MLC : కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజా నామినేషన్
జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు..
- By Latha Suma Published Date - 02:39 PM, Fri - 7 February 25

MLC : మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్‌లో మూడు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మీకి అందించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆలపాటి రాజా సరైన అభ్యర్థి అని చెప్పారు. వైసీపీ పాలనలో నాశనమైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి బాటలో పెడుతున్నారని చెప్పారు.
Read Also: Arrest warrant : అరెస్ట్ వారెంట్ పై స్పందించిన సోనూసూద్
ఉద్యోగ అవకాశాలు, రైతాంగ ప్రోత్సాహకాలు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుతం.. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం చరిత్రలో లికించ బడిందని ఆయన మండిపడ్డారు. జగన్ 1.0 చూసి ప్రజలు భయపడ్డారు. 2.0లో ఇంకేం జరుగుతుందోనని ప్రజలు జంకుతున్నారు. ఒక అపోహలో జగన్ జీవిస్తుంటారు. 175 సీట్లు వస్తాయని చెప్పుకున్నారు. ఫలితాలు ఎలా ఉన్నాయే చూసి కూడా మళ్ళీ మాట్లాడుతున్నారంటూ మంత్రి పార్థసారథి విరుచుకుపడ్డారు.
నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Read Also: Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..