WHO Chief Tedros: ఇజ్రాయెల్ దాడి నుండి తృటిలో తప్పించుకున్న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్
డాక్టర్ టెడ్రోస్ అధనామ్ తన బృందంతో సనా విమానాశ్రయంలో ఉన్నారు. విమానం ఎక్కబోతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంపై బాంబు దాడి చేసింది.
- By Gopichand Published Date - 04:47 PM, Fri - 27 December 24

WHO Chief Tedros: గురువారం యెమెన్‌లోని సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ (WHO Chief Tedros) అధనామ్ తృటిలో తప్పించుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ఒక విమాన సిబ్బంది గాయపడ్డారు. యెమెన్- ఇజ్రాయెల్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు ఈ ప్రాంతంలో పరిస్థితిని మరింత అస్థిరంగా మార్చాయి. ఈ వైమానిక దాడులను ‘ప్రమాదకరం’ అని గుటెర్రెస్ అభివర్ణించారు. అన్ని పార్టీలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
సనా విమానాశ్రయంలో ఏం జరిగింది?
డాక్టర్ టెడ్రోస్ అధనామ్ తన బృందంతో సనా విమానాశ్రయంలో ఉన్నారు. విమానం ఎక్కబోతున్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విమానాశ్రయంపై బాంబు దాడి చేసింది. దాడి కారణంగా WHO చీఫ్, అతని సహచరులు కొన్ని గంటలపాటు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. అతను సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితిని అంచనా వేయడానికి మా లక్ష్యం ముగిసింది. అయితే ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడిలో మా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు వార్తలు కూడా వచ్చాయని ఆయన తెలిపారు.
Also Read: Spirituality: ఇంటి ఇల్లాలు ఇలా చేస్తే చాలు ఇల్లు బంగారం అవ్వాల్సిందే!
ఐక్యరాజ్యసమితి, WHO ఏమి చెప్పాయి?
మృతుల కుటుంబాలకు డా. టెడ్రోస్ సంతాపం వ్యక్తం చేస్తూ యెమెన్‌లోని ఖైదీల విడుదలకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఖండన వ్యక్తం చేశారు. మానవతావాదులు, పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దని అన్నారు. అన్ని పార్టీలు సైనిక చర్యలకు దూరంగా ఉండాలన్నారు.
IDF ప్రకటన విడుదల చేసింది
హౌతీ తిరుగుబాటుదారుల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ఒక ప్రకటన విడుదల చేసింది. సనా విమానాశ్రయం, రాస్ ఖనతిబ్ పవర్ స్టేషన్, వెస్ట్ బ్యాంక్‌లోని ఓడరేవులపై బాంబు దాడి జరిగింది.