Spirituality: ఇంటి ఇల్లాలు ఇలా చేస్తే చాలు ఇల్లు బంగారం అవ్వాల్సిందే!
ఇంటి ఇల్లాలు కొన్ని రకాల పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఇంట్లో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారని ఇల్లు బంగారు మయం అవుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:33 PM, Fri - 27 December 24

ఇంటి ఇల్లాలు సంతోషంగా ఆనందంగా ఉంటే ఆ ఇంట్లోనే అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే ఒక ఇల్లు ఐశ్వర్యంగా, లక్ష్మీదేవి నివాసంగా మారాలి అంటే అది ఆ ఇంటి ఇల్లాలు చేతిలోనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు కొన్ని నియమాలను పద్ధతులను పాటించడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి సిరిసంపదలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇలాంటివి చాలా రకాల నియమాలను పాటించి చాలామంది వాళ్ళ ఇంటిని ఐశ్వర్యంగా సంతోషకరంగా మార్చుకుంటున్నారు. అందుకే ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అని అన్నారు పెద్దలు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇల్లాలు చేసే పనులు కుటుంబం పైన ప్రభావం చూపుతుంది. ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంటి ఇల్లాలు మూల కారణం. ఉదయం నిద్రలేచిన వెంటనే స్త్రీలు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం తరువాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రదేవ తాండవం చేస్తుంది..
నిద్రలేచిన వెంటనే నుదుట బొట్టు వుండే విధంగా చూసుకోవాలి. మొఖం కడుక్కోకుండా ఇంట్లో వంట గదిలోకి, పూజ గదిలోకి ప్రవేశించకూడదు. రాత్రి సమయంలో స్త్రీలు గాజలు, కమ్మలు తీయరాదు. అలాగే స్త్రీలు ఒకరు ధరించిన పూలను మరొకరు ధరించవద్దు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, మంచి పనులు చేయాలంటే శుక్ల పక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి మధ్యలోనే చేయాలి. బహుళ పక్షంలో చేయవద్దని పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ జుట్టు విరబూసుకొని వుండవద్దు. జ్యేష్టాదేవి జుట్టు విరబోసుకొని వుంటుంది, కాబట్టి ఇలా వుండకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో ఇవ్వకూడదు, ఎడమ చేతితో మాత్రమే ఇవ్వాలని చెబుతున్నారు. ఇంటి ఇల్లాలు రాత్రి అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదట. జీతం వచ్చిన వెంటనే ముందుగా ఉప్పు కొనాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందట. ఇంటి ఇల్లాలు నోటి నుంచి ఎప్పుడూ పీడా, దరిద్రం, శని, పీనుగు, కష్టము లాంటి పదాలు వినిపించకూడదట. స్త్రీలు ఎప్పుడూ కోపంగా, చిరాకుగా వుంటే ఇంట్లో అసలు సంతోషం వుండదు. అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సున్నితంగా మెలగాలి. ఇంట్లో మగవాళ్లు మంగళవారం, హెయిర్ కటింగ్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత ఇంటి ఇల్లాలుకు వుంటుంది. స్త్రీలు నలుపు రంగు వస్తువులను, నలుపు రంగా బట్టలను ఎప్పుడూ ధరించవద్దు. ఇంట్లో భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకికి పెట్టాలి. కాకికి పెట్టే ముందు భోజనాన్ని కుక్కకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది. ఉప్పు, చింతపండు, మిరపకాయలు ఎవ్వరి చేతికి కూడా ఇవ్వకూడదు. కిందపెట్టి వారినే తీసుకోమని చెప్పాలి. అలాగే సూర్యా స్తమయం తరువాత ఇంటి ఇల్లాలు తల దువ్వడం చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట. కాలిపై కాలు వేసుకొని, కాళ్లు ఊపుతూ, ఒంటి కాలిపై నిలబడ్డం లాంటివి చేయకూడదట.
ఇలాంటి చర్యలు దరిద్రాన్ని కలిగిస్తాయట. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బంధువులు వస్తే వారికి ఎదురువెళ్లి వారిని ఆహ్వానించవద్దు. అలా చేయడం వల్ల కష్టాలను, బాధలను ఆహ్వానించినట్టవుతుంది. ఇంటి ఇల్లాలు ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేసుకోవాలి. మధ్యాహ్నం తరువాత స్నానం చేస్తే ఆ ఇల్లు పేదరికంతో పాటు కష్టాలపాలవుతుంది. ఇంట్లో రోజుకు ఒక్కసారైనా దీపం పెట్టుకుంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో దీపం వెలిగించిన తరువాత పాలు, నెయ్యి, పసుపు బయట ఎవ్వరికీ ఇవ్వవద్దు. ఇంటి బయట సాయంత్రం లోపు ఆరవేసిన బట్టలను తీసివేయాలి. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు పెట్టకూడదు. ఇంటి ఇల్లాలు పైన చెప్పిన విషయాలను పాటిస్తే ఇళ్లు లక్ష్మీ నివాసంగా మారుతుంట. ఇంట్లో దరిద్రం దరిచేరకుండా కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు.