HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Warplane Crashes In Kuwait

కువైట్ లో కూలిన అమెరికా యుద్ధ విమానం

  • Author : Vamsi Chowdary Korata Date : 02-03-2026 - 12:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Us F 15 Crashes In Kuwait
Us F 15 Crashes In Kuwait

F-15E Strike  కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరం సమీపంలో యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం కుప్పకూలింది. విమానం భూమిని ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందే పైలట్ చాకచక్యంగా ఎజెక్ట్ అయ్యి పారాచూట్ సాయంతో కిందకు దిగాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం అదుపుతప్పి గాల్లో గింగిరులు కొడుతూ కింద పడిపోవడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పైలట్‌కు స్థానికులు సాయం చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, స్వల్ప గాయాలతో బయటపడ్డాడని తెలుస్తోంది.

ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందా? లేక పొరపాటున జరిగిన ‘ఫ్రెండ్లీ ఫైర్’ వల్ల జరిగిందా? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడుల నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై అమెరికా రక్షణ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ప్రత్యేకతలు
అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఒక శక్తిమంతమైన మల్టీరోల్ యుద్ధ విమానం. ఇది గగనతలంలో శత్రు విమానాలతో పోరాడటంతో పాటు, భూమిపై ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రాత్రివేళల్లో, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సుదీర్ఘ శ్రేణి లక్ష్యాలపై దాడులు చేసేలా దీనిని రూపొందించారు.

ఇందులో ఇద్దరు వ్యక్తులు కూర్చునేలా టెన్డమ్ కాక్‌పిట్, అదనపు ఇంధనం కోసం కన్ఫార్మల్ ట్యాంకులు మరియు అత్యాధునిక టార్గెటింగ్ వ్యవస్థలు ఉంటాయి. ఇతర విమానాల రక్షణ అవసరం లేకుండానే శత్రువుల లోతైన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి దాడులు చేయగలగడం ఈ ఫైటర్ జెట్ ప్రత్యేకత అని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aviation Accident
  • F-15E Strike Eagle
  • Fighter Jet
  • Kuwait
  • Middle East
  • military base
  • Operation Epic Fury
  • US Air Force
  • US F-15
  • US F-15 Crashes
  • US F-15 Crashes in Kuwait
  • US militarY
  • warplane crash

Related News

    Latest News

    • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

    • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

    • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

    • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

    • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

    Trending News

      • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

      • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd