HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Russia Energy Talks Amid Ukraine War Tariffs On India

Russia-US : అమెరికా- రష్యా మధ్య కీలక ఒప్పందం.. భారత్‌పై కక్షసాధింపు చర్యలు, రష్యాతో ఒప్పందాలా?..

Russia-US : ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా-రష్యా సంబంధాల్లో కొత్త మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు శాంతి చర్చల దిశగా పలు అడుగులు వేస్తూ, ముఖ్యంగా ఎనర్జీ ఒప్పందాలు ప్రధాన చర్చా అంశంగా మారాయి.

  • Author : Kavya Krishna Date : 27-08-2025 - 12:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russia Us
Russia Us

Russia-US : ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా-రష్యా సంబంధాల్లో కొత్త మలుపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల అధికారులు శాంతి చర్చల దిశగా పలు అడుగులు వేస్తూ, ముఖ్యంగా ఎనర్జీ ఒప్పందాలు ప్రధాన చర్చా అంశంగా మారాయి. మాస్కో-న్యూయార్క్ మధ్య జరిగిన రహస్య చర్చల్లో పలు కీలక ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. వెస్ట్రన్ సాంక్షన్లతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా, తన Arctic LNG 2 సహా పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్రాజెక్టులు కొనసాగించేందుకు అమెరికా పరికరాల అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో, పరిమిత సహాయ ప్యాకేజీ కింద అమెరికా నుంచి రష్యా కొన్ని సాంకేతిక పరికరాలను దిగుమతి చేసుకునే అవకాశం పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, దీనికి ప్రత్యామ్నాయంగా అమెరికా ఒక ఆసక్తికర ప్రతిపాదన చేసింది. రష్యా తయారు చేసే న్యూక్లియర్ శక్తితో నడిచే ఐస్‌బ్రేకర్లు (Nuclear-powered Icebreakers) ను అమెరికా కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇది ఇరు దేశాలకు ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

TVK : ఫ్యాన్స్ షాక్.. దళపతి విజయ్పై కేసు నమోదు..

ఇటీవల మాస్కో పర్యటనలో ఉన్న అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ దిమిత్రివ్ లతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో పలు ఎనర్జీ ఒప్పందాలు, పెట్టుబడులు, భవిష్యత్తు వ్యాపార అవకాశాలపై లోతైన చర్చలు జరిగినట్లు రాయిటర్స్ పేర్కొంది. అంతేకాకుండా, అమెరికా వైట్ హౌస్ ఈ చర్చల తర్వాత అలాస్కా సమ్మిట్‌ను ప్రధాన విజయంగా ప్రొజెక్ట్ చేయాలని యోచిస్తోంది. “ట్రంప్ భారీ పెట్టుబడి ఒప్పందాన్ని సాధించాడు” అనే శీర్షికలు రావాలని వైట్ హౌస్ ఆశపడుతుండటం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఇమేజ్‌ను బలోపేతం చేయాలన్న ప్రయత్నంగా భావిస్తున్నారు. కొంతమంది అధికారులు దీనిని ఆయన శాడిజం (self-promotion mentality) గా వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన భారత్‌లో కలకలం రేపింది. ఆయన మాట్లాడుతూ—రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు పై అదనంగా 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న సుంకాలకు తోడు కొత్త పన్నులు విధించబడటంతో, భారతీయ దిగుమతులపై మొత్తం సుంకం 50%కి చేరుకుంది. ఒకవైపు రష్యాతో రహస్య చర్చలు జరుపుతూ, ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకోవడం… మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్‌పై కఠిన ఆంక్షలు విధించడం—ట్రంప్ ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తోందని అంతర్జాతీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.

“రష్యాతో సన్నిహితంగా వ్యవహరించాలనుకోవడం, కానీ మూడో దేశాలపై ఒత్తిడి తేవడం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమే” అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా-రష్యా మధ్య జరుగుతున్న ఈ చర్చలు కేవలం ఆర్థిక ఒప్పందాలకే పరిమితం కాకుండా, శాంతి చర్చలకు దారితీసే మొదటి అడుగు కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా LNG ప్రాజెక్టులకు అమెరికా పరికరాలు అందించడం వాస్తవమైతే, ఇది వెస్ట్రన్ సాంక్షన్లలో చీలికకు దారితీయవచ్చు. భారత్‌పై సుంకాల పెంపు దక్షిణాసియా-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Ganesh Chaturthi 2025: చవితి నాడు తినాల్సిన ఆకు కూర ఇదే..గణపయ్యకు చాల ఇష్టం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Energy Deals
  • India Oil Imports
  • ukraine war
  • US-Russia Relations

Related News

Trump's sensational decision: Green Card Lottery program suspended

ట్రంప్ సంచలన నిర్ణయం: గ్రీన్ కార్డ్ లాటరీ ఫ్రోగ్రామ్ నిలిపివేత

బ్రౌన్ మరియు ఎంఐటీ యూనివర్సిటీల్లో జరగిన కాల్పుల కేసులో నిందితుడు లాటరీ వీసా ద్వారా మాత్రమే అమెరికాలో ప్రవేశించాడని తేలడంతో, ఆయన గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశించారు.

  • Travel Ban

    అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

Latest News

  • వరల్డ్‌కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్‌ గిల్‌ ఔట్?

  • మంత్రి లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది

  • సర్పంచ్ ఫలితాలపై టీపీసీసీ చీఫ్ అసంతృప్తి

  • ఆ 10 డెంటల్ కళాశాలలపై రూ.100 కోట్ల జరిమానా? సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

  • బీజేపీలో చేరనున్న టాలీవుడ్ సీనియర్ నటి

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd