Ganesh Chaturthi 2025: చవితి నాడు తినాల్సిన ఆకు కూర ఇదే..గణపయ్యకు చాల ఇష్టం
Ganesh Chaturthi 2025: గణేశుడికి ద్రోణపుష్పి ఆకులు సమర్పించడం భక్తి, అంకితభావానికి ప్రతీక. పూజ అనంతరం ఆ ఆకును వంటలో వాడటం లేదా తినడం సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సహాయపడే ఆచారం కూడా
- By Sudheer Published Date - 07:45 AM, Wed - 27 August 25

Ganesh Chaturthi : భాద్రపద మాసంలో జరిగే వినాయక చవితి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున గణపతిని పూజించడం ద్వారా జ్ఞానం, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం. తొమ్మిది రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొని, గణపతికి ఇష్టమైన వంటకాలు(Ganapati’s favorite Dishes), మిఠాయిలు సమర్పిస్తారు. ఈ సందర్భంలో పెద్దలు తప్పనిసరిగా తుమ్మికూర(Thummikura) వండుకుని తినాలని చెబుతారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా, ఆరోగ్య రీత్యా కూడా ఎంతో ప్రయోజనకరమైనది.
వినాయక చవితి శరదృతువు ప్రారంభంలో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పాటు మన శరీరంలో కూడా మార్పులు సంభవిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు సులభంగా వ్యాపించే ఈ కాలంలో శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. మన మునులు, ఋషులు ఈ విషయాన్ని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడే ఆకుకూరలను ఆచారాల్లో భాగం చేశారు. వాటిలో ద్రోణపుష్పి ఆకులు లేదా తుమ్మికూర ప్రత్యేక స్థానం సంపాదించాయి.
గణేశుడికి ద్రోణపుష్పి ఆకులు సమర్పించడం భక్తి, అంకితభావానికి ప్రతీక. పూజ అనంతరం ఆ ఆకును వంటలో వాడటం లేదా తినడం సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సహాయపడే ఆచారం కూడా. దేవునికి సమర్పించిన నైవేద్యం శరీరానికి ఔషధంగా పనిచేస్తుందనే విశ్వాసం ఉంది. ఈ విధంగా వినాయక పూజ మనల్ని భక్తి మార్గంలో నడిపించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.