HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Ready For Another Round Of Attacks On Iran

Donald Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump
Donald Trump

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఈసారి మరింత తీవ్రంగా కమ్ముకుంటున్నట్లు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా దాడుల గురించిన ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రస్తుత దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్‌పై సరికొత్త సైనిక దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వివాదానికి శాశ్వతంగా ముగింపు పలికేలా ఒకే ఒక్క భారీ నిర్ణయాత్మక దాడి చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి.

దీనిపై శుక్రవారం ఉదయం తన జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి, సైనిక పరమైన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ట్రంప్ తన వీకెండ్ ప్లాన్స్‌ను మార్చుకొని వాషింగ్టన్‌లోనే ఉండిపోయారు. తన పెద్ద కుమారుడి వివాహ వేడుకకు కూడా వెళ్లకుండా వైట్‌హౌస్‌కే పరిమితం కావడం అక్కడి తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.

మరోవైపు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతార్ ప్రతినిధుల బృందం టెహ్రాన్‌లో చివరి ప్రయత్నంగా మధ్యవర్తిత్వ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుండటంతో ట్రంప్‌లో అసహనం పెరుగుతోందని, అమెరికా పంపిన ‘చివరి ప్రతిపాదన’ను తిరస్కరిస్తే సైనిక చర్య తప్పదంటూ ఇరాన్‌ను ఇప్పటికే హెచ్చరించినట్లు సమాచారం వినిపిస్తోంది.

అమెరికా-ఇజ్రాయెల్‌తో మూడు నెలల పాటు జరిగిన యుద్ధం ముగిసిన కొన్ని వారాల్లోనే ఇరాన్ మళ్లీ తన డ్రోన్ల తయారీ కేంద్రాలను పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో చర్చలు ఏదో ఒక కొలిక్కి రాకపోతే.. అమెరికా ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం ఉందనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Iran Nuclear Program
  • Military Attack
  • United States
  • US - Iran War

Related News

The prices of essential commodities that are shaking America

US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి పడగవిప్పింది. గ్యాసోలిన్ (పెట్రోల్), కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం కష్టతరంగా మారింది. షిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం గత 12 నెలల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏకంగా 3.8 శాతం పెరిగింది. ఇది 2023 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. కేవలం ఏప్రిల్ నెలలోనే ద్రవ్యోల్బణం 0.6 శాతం పెరిగింది. అ

  • Massive Shock to the Trump Administration

    Donald Trump: ట్రంప్‌ సర్కార్‌కు భారీ షాక్‌..

  • Imran Khan

    Imran Khan: పాక్ చరిత్రలోనే బిగ్గెస్ట్ లీక్.. ఇమ్రాన్‌ ఖాన్‌ను గద్దె దింపింది అమెరికాయేనా?

Latest News

  • Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

  • Rukmini Vasanth: బికినీలో డ్రాగన్ బ్యూటీ.. రుక్మిణి వసంత్

  • NEET: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం

  • Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!

  • Donald Trump: ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సిద్ధం..

Trending News

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd