HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >The Prices Of Essential Commodities That Are Shaking America

US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

  • Author : Vamsi Chowdary Korata Date : 21-05-2026 - 12:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The prices of essential commodities that are shaking America
The prices of essential commodities that are shaking America

అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి పడగవిప్పింది. గ్యాసోలిన్ (పెట్రోల్), కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం కష్టతరంగా మారింది. షిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం గత 12 నెలల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏకంగా 3.8 శాతం పెరిగింది. ఇది 2023 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. కేవలం ఏప్రిల్ నెలలోనే ద్రవ్యోల్బణం 0.6 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలు, ఇంధన సరఫరాలో అంతరాయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ప‌శ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచంలోనే కీలకమైన ఇంధన రవాణా మార్గం హ‌ర్మూజ్ జలసంధి గుండా చమురు సరఫరాలో ఏర్పడిన ఆటంకాల వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా కార్మిక గణాంకాల బ్యూరో (బీఎల్ఎస్‌) ప్రకారం గత ఏడాది కాలంలో ఇంధన ధరలు 17.9 శాతం పెరగ్గా, ఒక్క గ్యాసోలిన్ ధరలే 28.4 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా గ్యాసోలిన్ సగటు ధర గ్యాలన్‌కు 4.50 డాలర్లు దాటింది. రవాణా ఖర్చులు పెరగడంతో ఆ ప్రభావం దాదాపు అన్ని వస్తువుల ధరలపై పడుతోంది. ట్రక్కుల రవాణా వ్యయం పెరిగితే, దానిని సూపర్‌మార్కెట్లు, రిటైలర్లు వినియోగదారులపైనే మోపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఇంధన ధరలతో పాటు ఆహార పదార్థాల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో కిరాణా సరుకుల ధరలు 0.7 శాతం పెరిగాయి. ముఖ్యంగా గొడ్డు మాంసం, కాఫీ, పండ్లు, కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. “ప్రతిదాని ధర పెరిగింది. ఆహారం, గ్యాస్, బట్టలు, ఇంటి అద్దె.. ఇలా ఏది చూసినా పైపైకే పోతోంది” అని గ్లెన్‌డేల్‌కు చెందిన మ్యాక్సీ బేకర్ అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం. ఏప్రిల్‌లో ఉద్యోగుల నిజమైన సగటు గంట వేతనాలు 0.5 శాతం తగ్గాయని బీఎల్ఎస్‌ తెలిపింది. అంటే.. జీతాలు కాగితంపై పెరిగినట్లు కనిపిస్తున్నా, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. “డబ్బులు దేనికీ సరిపోవడం లేదు. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అర్థం కావడం లేదు” అని లాస్ ఏంజిల్స్‌లోని ఓ రిటైల్ షాపు ఉద్యోగి డెనిస్ కోన్ వాపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, క్రెడిట్ కార్డుల వాడకం పెంచడం వంటివి చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Food Prices
  • Gas Prices
  • Grocery prices
  • US inflation

Related News

Trump warns China over Panama Canal: We will not allow it.

Donald Trump: పనామా కాలువ విషయంలో చైనాను హెచ్చరించిన ట్రంప్: దీనిని మేము అనుమతించము.

పనామా కాలువపై నియంత్రణను కోల్పోవడం అమెరికా చేసిన పొరపాటని, చైనా ఆ కాలువను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, “మేము దానిని అనుమతించము” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, చమురు ధరలు తగ్గుతూనే ఉంటాయని మరియు అమెరికా “ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన దేశంగా” మారిందని చెబుతూనే, పుట్టుకతోనే పౌరసత్వం లభించే విధానాన్ని (birthright citizenship) ఆయన విమర్

  • US President Trump to visit India; to meet Prime Minister Modi.

    Donald Trump: భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ.

Latest News

  • Lakshmi: లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా?

  • Hair Tips: ప్రతిరోజు దీన్ని తలకు పట్టించుకుంటే చాలు.. జుట్టు గడ్డిలా గుబురుగా పెరగడం ఖాయం!

  • Shah Rukh Khan: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు

  • NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ రిజల్ట్స్ డేట్.. NTA నుంచి బిగ్గెస్ట్ అప్‌డేట్

  • Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత అరెస్ట్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd