HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Update On The Talli Ki Vandanam Scheme

Thalliki Vandanam: తల్లికి వందనం పథకంపై అప్‌డేట్..

  • Author : Vamsi Chowdary Korata Date : 23-05-2026 - 11:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thalliki Vandanam
Thalliki Vandanam

ఏపీలో విద్యార్థులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. జూన్ నెలలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. అయితే తల్లికి వందనం లబ్ధిదారులు ఆధార్, బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేసి ఉండాలని, ఒకవేళ చేయకపోతే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తోంది. వీటిలో రూ.13వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు, రూ.2వేలు మాత్రం పాఠశాలల నిర్వహణ కోసం కేటాయిస్తున్నారు. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.. పాఠశాలలు కూడా మొదలుకానున్నాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ‘తల్లికి వందనం’ పథకం కింద డబ్బులు అకౌంట్లో జమ కావాలంటే విద్యార్థి తల్లి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి.

గతేడాది తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో అనుసంధానం కాకపోవడంతో చాలామంది విద్యార్థులు అర్హత ఉండి కూడా ‘తల్లికి వందనం’ పథకానికి దూరమయ్యారు. ఈ కారణంతో గతేడాది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ కాలేదు. గతేడాది ఎదురైన సమస్యను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ విద్యార్థుల తల్లులను అలెర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ బ్యాంకులకు వెళ్లి అకౌంట్‌కు ఆధార్ అనుసంధానమై ఉందో లేదో సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ లింక్ కాకపోతే వెంటనే చేసుకోవాలని, లేకపోతే డబ్బులు అకౌంట్‌లో జమ కావని చెబుతున్నారు.

తల్లికి వందనం పథకానికి అర్హులైన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ అకౌంట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లే సమయంలో తమ వెంట ఆధార్‌ కార్డు తీసుకొని వెళ్లాలని, ఒకవేళ బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌ లింక్ కాకపోతే వెంటనే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై సంతకం చేసి బ్యాంకులో సమర్పించాలని అన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే మొబైల్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు.

అలాగే ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్ యూఐడీఏఐలోకి వెళ్లి మై ఆధార్‌ నుంచి ఆధార్‌ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్‌ లింక్‌ సర్వీసెస్‌ ఆప్షన్‌ క్లిక్ చేస్తే లాగిన్‌ వస్తుంది. అక్కడ 12 అంకెల ఆధార్‌ నంబరు ఎంటర్ చేసి, ఆ కింద ఉండే క్యాప్చర్‌ కోడ్‌ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్ చేస్తే ఆధార్‌కు ఏ బ్యాంకు లింక్ ఉందన్న సమాచారం తెలుస్తుంది. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకుంటే సంబంధిత బ్యాంకును సంప్రదిస్తే ఆధార్‌ను అనుసంధానం చేస్తారని అధికారులు తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhar link
  • andhra pradesh
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • bank account
  • Education Minister Nara Lokesh
  • Thalliki Vandanam
  • Thalliki Vandanam News
  • Thalliki Vandanam Scheme

Related News

Tender coconut claims a life

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి

  • CM Chandrababu to inaugurate the Rayalaseema Steel Plant in Kadapa.

    Chandrababu Naidu: రాయలసీమ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్‌ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • AP EAPCET results released

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd