Donald Trump : జన్మతః పౌరసత్వం రద్దు ..సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్
మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా..?కాదా..?అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు.
- Author : Latha Suma
Date : 14-03-2025 - 11:56 IST
Published By : Hashtagu Telugu Desk
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ఆదేశాలను ఫెడరల్ కోర్టులు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు చేరారు. యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ సారా హారిస్ ఈ పిటిషన్ సాధారణమైనదని అభివర్ణించారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యంగబద్ధమా..?కాదా..?అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు.
Read Also: BJP : నామినేటెడ్ పదవులపై అధిష్టానం నిర్ణయం : పురంధేశ్వరి
ఇటీవల ట్రంప్ సర్కారు తొలగించిన పలువురు ప్రొబేషనరీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆరు ఏజెన్సీలకు కాలిఫోర్నియాలో న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్, మసాచుసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. ఈ ఆదేశాలు దేశ ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని రాజ్యంగపరమైన విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయన్నారు.
ఇకపోతే..అమెరికా చట్టాల ప్రకారం.. ఆ దేశ పౌరులకు పుట్టినవారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతిఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే, తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దీనికి బ్రేక్ పడింది.
ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే, తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ.. తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది. 2024 చివరినాటికి 5.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47 శాతం భారతీయులే. వీరిలో 34 శాతం మంది అమెరికాలో పుట్టినవారు ఉన్నారు.
Read Also: Jana Sena 12th Foundation Day : జనసేన విజయం వెనుక అసలు కారణాలు ఇవే