HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Russia America New Start Treaty

అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబర్ 2025లో ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిపాదనపై ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.

  • Author : Gopi Date : 05-02-2026 - 1:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Russia- America
Russia- America

Russia- America: నియంత్రణ లేని అణు ఆయుధాల తయారీ 2011 నుండి అమలులో ఉన్న ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాలు గరిష్టంగా 1550 వార్‌హెడ్‌లు, 700 లాంచర్లు, 800 మోహరించిన లాంచర్లను మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఉంది. ఈ ఒప్పందం ముగియడంతో 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇరు దేశాలపై అణు ఆయుధాల తయారీ విషయంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా పోయాయి. ఇది ప్రపంచ భద్రతకు తీవ్ర ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రష్యా ప్రతిపాదనను పట్టించుకోని అమెరికా

రష్యా అధ్యక్షుడు పుతిన్ సెప్టెంబర్ 2025లో ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించాలని ప్రతిపాదించారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ప్రతిపాదనపై ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. నేటి పరిస్థితుల్లో చైనా ఈ ఒప్పందంలో భాగస్వామి కానప్పుడు దీనికి ప్రాముఖ్యత లేదని అమెరికా భావిస్తోంది. ఇప్పుడు రష్యా కూడా ఈ నిబంధనలను పాటించడానికి నిరాకరించడంతో అణు ఆయుధాల పోటీ మళ్లీ మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Also Read: మూగ, చెవిటి యువతిపై కన్నతండ్రే అత్యాచారం..

ఒప్పందం నేపథ్యం.. ఒబామా – మెద్వెదేవ్ సంతకాలు

2010లో కుదిరిన ఈ ‘న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ’ 2011లో అమలులోకి వచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ దీనిపై సంతకాలు చేశారు. ఒక దేశపు రాజకీయ, సైనిక, పారిశ్రామిక కేంద్రాలను నాశనం చేయగల భారీ అణు ఆయుధాల మోహరింపును పరిమితం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యం.

1970ల నుండి సాగిన అణు చర్చల ప్రస్థానం

అమెరికా-రష్యాల మధ్య అణు నియంత్రణ చర్చలు 1970ల నాటి శీతల యుద్ధ కాలంలో ప్రారంభమయ్యాయి:

SALT ఒప్పందం: అణు ఆయుధాల సంఖ్యను అరికట్టాలని ప్రతిపాదించారు.

1991 (START-I): జార్జ్ బుష్, గోర్బచెవ్ మధ్య ఒప్పందం కుదిరి అణు ఆయుధాలపై ఆంక్షలు విధించారు.

1993 (START-II): ఆయుధాల తగ్గింపుపై ఒప్పందం జరిగినప్పటికీ అది సరిగ్గా అమలు కాలేదు.

2002 (SORT): జార్జ్ బుష్- పుతిన్ మధ్య 1700-2200 వార్‌హెడ్‌లను తగ్గించడానికి అంగీకారం కుదిరింది.

2011 (New START): 2010లో ప్రాగ్ నగరంలో సంతకాలు జరగగా 2011 ఫిబ్రవరి 5 నుండి అమలులోకి వచ్చింది. దీనిని 2021లో జో బైడెన్ మరో ఐదేళ్లు పొడిగించారు.

ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల నిల్వలు

ప్రస్తుతం ప్రపంచంలోని అణు ఆయుధాలలో 90 శాతానికి పైగా రష్యా- అమెరికా వద్దే ఉన్నాయి.

రష్యా: 4309 వార్‌హెడ్‌లు (జనవరి 2025 నాటికి)

అమెరికా: 3700 వార్‌హెడ్‌లు

చైనా: 600 వార్‌హెడ్‌లు

ఫ్రాన్స్: 290 వార్‌హెడ్‌లు

బ్రిటన్: 225 వార్‌హెడ్‌లు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • NEW START Treaty
  • Russia- America
  • Russian President Putin
  • world news

Related News

Trump Hints At Restarting Iran War

Hormuz Strait: ఇరాన్ పై ట్రంప్ దెబ్బ

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా నేతృత్వంలో కొనసాగుతున్న కఠినమైన దిగ్బంధనం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా పొందాల్సిన దాదాపు 5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయిందని అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అంచనా వేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఇరాన్‌ను మళ్లీ చర్చల వేదికకు తీసుకురావడానికి ఈ ఆర్థిక

  • President Trump on wearing a bulletproof vest

    Donald Trump: బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

Latest News

  • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

  • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

  • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

  • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

  • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

Trending News

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd