Siblings In China: చైనాలోని చెత్త కుప్పలో 24 లక్షల విలువైన 30 ఐఫోన్‌లు.. చూసిన అక్క, తమ్ముడు ఏం చేశారంటే..?
చైనాలో ఒక అక్క, తమ్ముడు (Siblings In China)నిజాయితీకి ఉదాహరణగా నిలిచారు. దాదాపు 24 లక్షల విలువైన 30 కొత్త ఐఫోన్ 14 ప్రో మొబైల్స్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
- Author : Gopichand
Date : 07-08-2023 - 7:54 IST
Published By : Hashtagu Telugu Desk
Siblings In China: చైనాలో ఒక అక్క, తమ్ముడు (Siblings In China)నిజాయితీకి ఉదాహరణగా నిలిచారు. దాదాపు 24 లక్షల విలువైన 30 కొత్త ఐఫోన్ 14 ప్రో మొబైల్స్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సోదరుడు-సోదరి ద్వయం వారి అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని డస్ట్‌బిన్‌లో 30 కొత్త ఐఫోన్ 14 ప్రో మొబైల్‌లను కనుగొన్నారు. ఈ ఘటన గత నెల జులై 7న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో వచ్చిన కథనం ప్రకారం.. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన ఒక బాలుడు రెండు డస్ట్‌బిన్‌లలో 30 ఫోన్‌లను కనుగొన్నాడు. ఆ అబ్బాయి మొదట తన అక్కకి ఈ సమాచారం ఇచ్చాడు. దీని తరువాత తోబుట్టువులు కలిసి రెండు డస్ట్‌బిన్‌ల నుండి 30 ఐఫోన్ 14 ప్రో ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Facebook: యువకుడిని నగ్న కాల్స్ చేయమని అడిగిన యువతీ.. అసలు విషయం తెలియడంతో?
డెలివరీ చేసే వ్యక్తి అనుకోకుండా వదిలేశాడు
ఫోన్ రావడంతో చైనాలోని అన్నదమ్ములు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న పోలీసులు, అక్కడి నుంచి ఫోన్‌ని స్వాధీనం చేసుకుని, అసలు ఆ ఫోన్ యజమాని ఎవరో గుర్తించారు. పోలీసులు విచారించగా ఫోన్‌ను లియు అనే డెలివరీ మ్యాన్ పొరపాటున వదిలేసినట్లు గుర్తించారు. అతను డస్ట్‌బిన్ పైన ఐదు పెట్టెలను ఉంచాడు. ఒక్కొక్క దాంట్లో 10 కొత్త ఐఫోన్ 14 ప్రో మోడల్ లు ఉన్నాయి.
క్లీనర్ ఫోన్ పెట్టెలను డస్ట్‌బిన్‌లో పడేశాడు
పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా లియు ఐదు బాక్సులను డస్ట్‌బిన్ పై ఉంచినట్లు గుర్తించారు. ఫోన్ ఐదు బాక్సులను రెండు గంటల తర్వాత ఓ క్లీనర్ డస్ట్‌బిన్‌లో పడేశాడు. మిస్టర్ లియు కంపెనీ క్లీనర్‌ను సంప్రదించగా తాను కార్డ్‌బోర్డ్ బాక్సులను తీసి ఫోన్‌లన్నింటినీ చెత్తబుట్టలో పడేసినట్లు అంగీకరించాడు.