Russia-Ukraine War: ఉక్రెయిన్ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి
ఉక్రెయిన్ ఆస్పత్రిపై రష్యా దాడి, 47 మంది మృతి.ఉక్రెయిన్ రాజధాని పోల్టావా నగరంలో ఈ దాడి జరిగింది. ఇది రష్యా సరిహద్దు నుండి 110 కిలోమీటర్లు మరియు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది
- By Praveen Aluthuru Published Date - 09:53 PM, Tue - 3 September 24
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా మళ్లీ క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్‌లోని మధ్య-తూర్పు ప్రాంతమైన పోల్టావాను రెండు బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యంగా చేసుకున్నాయి. సైనిక కేంద్రం సమీపంలోని ఆసుపత్రిపై జరిగిన ఈ దాడిలో 47 మంది మరణించారు. 206 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మధ్యకాలంలో రష్యా డ్రోన్లు మరియు క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది.
ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ రాజధాని పోల్టావా నగరంలో ఈ దాడి జరిగింది. ఇది రష్యా సరిహద్దు నుండి 110 కిలోమీటర్లు మరియు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుండి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 24, 2022 నుండి జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం జరిపిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఈ దాడి ఒకటిగా చూస్తున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏం చెప్పారు?
“మిలిటరీ కమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్ భవనం పాక్షికంగా ధ్వంసమైంది” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మంగళవారం తన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. ప్రజలు శిథిలాల కింద ఇరుక్కున్నారని, ఈ దాడి కారణంగా చాలా మందిని రక్షించారని తెలిపారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం కోసం దర్యాప్తునకు తాను ఆదేశించినట్లు చెప్పాడు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వైమానిక దాడుల హెచ్చరిక జారీ చేసిన వెంటనే క్షిపణి దాడి జరిగింది. ఆ సమయంలో ప్రజలు బంకర్ల వైపు వెళ్తున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రెస్క్యూ బృందాలు మరియు వైద్యులు 25 మందిని రక్షించారు. వీరిలో 11 మందిని శిథిలాల నుంచి బయటకు తీశారు.
ఇదిలా ఉండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం మంగోలియాలో పర్యటించారు. దాదాపు 18 నెలల క్రితం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత పుతిన్ ఐసీసీ సభ్య దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. పుతిన్‌పై యుద్ధ నేరాలు, ఉక్రెయిన్‌కు చెందిన పిల్లలను కిడ్నాప్ చేసి రష్యాకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పర్యటనకు ముందు పుతిన్‌ను హేగ్‌లోని ఐసీసీకి అప్పగించాలని ఉక్రెయిన్ మంగోలియాకు విజ్ఞప్తి చేసింది.
Also Read: Priyansh Arya: ఆర్సీబీపై కన్నేసిన సిక్సర్ల కింగ్ ప్రియాంష్ ఆర్య
Related News
US Trip Purely Personal, DK Shivakumar: బరాక్ ఒబామా, కమలా హారిస్‌లతో డీకే శివకుమార్ భేటీ ?
US Trip Purely Personal, DK Shivakumar: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లను కలవబోతున్నట్లు మీడియాలో వచ్చిన కథనాలల్లో వాస్తవం లేదని, తన అమెరికా పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 వరకు కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్తున్నానని