HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Ap Students Fee Reimbursement Funds Released

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 13-03-2026 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Fee Reimbursement
Ap Fee Reimbursement
AP Fee Reimbursement  ఏపీలోని కాలేజీ విద్యార్థులకు, యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. నెల రోజులుగా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. నిధులపై వడ్డీ కోత విధించాలన్న ప్రతిపాదనతో తలెత్తిన వివాదానికి సీఎం చంద్రబాబు జోక్యంతో తెరపడింది. ఎలాంటి కోతలు లేకుండా పూర్తి బకాయిలను విడుదల చేయాలని ఆయన ఆదేశించడంతో నిధుల విడుదల ప్రక్రియ మళ్లీ మొదలైంది.

వివరాల్లోకి వెళితే… 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రూ.1200 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు గత నెల 10న బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ (బీఆర్వో) జారీ చేసింది. అయితే, నిధులు విడుదల చేయడంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఓ మెలిక పెట్టారు. ప్రభుత్వం రుణం తెచ్చి ఈ బకాయిలు చెల్లిస్తున్నందున, ఆ రుణంపై పడే 7.5శాతం వడ్డీని (సుమారు రూ.90 కోట్లు) కాలేజీ యాజమాన్యాలే భరించాలని ప్రతిపాదించారు. అంతేకాకుండా కాలేజీలే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయాలని కోరారు.

అధికారుల ప్రతిపాదనను కాలేజీ యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలకు తామే వడ్డీ కట్టడమేంటని, రుణం తీసుకున్నట్లు ఎలా సంతకాలు చేస్తామని ప్రశ్నించాయి. ఈ వివాదం కారణంగా నిధుల విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో పలు కాలేజీల యాజమాన్యాలు మెయిల్స్ ద్వారా నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశాయి. తమకు రావాల్సిన బకాయిలపై వడ్డీ విధించడం అన్యాయమని ఆయన దృష్టికి తీసుకెళ్లాయి.

ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన ముఖ్య‌మంత్రి, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వడ్డీ ప్రతిపాదనను వెంటనే పక్కనపెట్టి, బకాయిలను యథాతథంగా విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్ర‌బాబు ఆదేశాలతో సాంఘిక సంక్షేమ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. తొలి విడతగా బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.300 కోట్ల నిధులను విడుదల చేసింది. మిగిలిన రూ.900 కోట్లను ఉగాది పండుగలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో కాలేజీ యాజమాన్యాలు ఊపిరి పీల్చుకొని హర్షం వ్యక్తం చేశాయి. త్వరలోనే ఈ నిధులు కాలేజీల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh Govt
  • AP CM Chandrababu Naidu
  • AP Fee Reimbursement
  • AP Fee Reimbursement funds release
  • AP Student Welfare
  • college fees
  • Education Funds
  • Fee Dues
  • Higher Education
  • Student Welfare

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd