Priyansh Arya: ఆర్సీబీపై కన్నేసిన సిక్సర్ల కింగ్ ప్రియాంష్ ఆర్య
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాంష్ ఆర్య అద్భుతమైన ఆటతీరుతో ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మరియు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కాగా తాజాగా ఈ యువకెరటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు
- By Praveen Aluthuru Published Date - 09:27 PM, Tue - 3 September 24
Priyansh Arya: 2025 ఐపీఎల్ వేలం గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. రిలీజ్, రెటైన్షన్ పై ప్రతిఒక్కరు చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఫ్రాంచైజీలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటామో అర్ధం కానీ పరిస్థితి. అయితే ఎప్పుడూ హృదయాలను మాత్రమే గెలిచే ఆర్సీబీ ఈ సారి కప్ గెలిచే అవకాశం ఉంది. సీనియర్లను పక్కనపెట్టి మంచి టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్లను తీసుకోవాలని భావిస్తుంది.
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ప్రియాంష్ ఆర్య అద్భుతమైన ఆటతీరుతో ఆశ్చర్యపరిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మరియు నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కాగా తాజాగా ఈ యువకెరటం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలంలో తన ఎంపికకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రియాంష్ చెప్పాడు. ఐపీఎల్ లో నా ఫెవరెట్ జట్టు ఆర్సీబీ. అందులో నా ఆరాధ్య క్రికెటర్ కోహ్లీ. కోహ్లీ దూకుడు నాకు చాలా ఇష్టం. నాకు కూడా దూకుడు క్రికెట్ ఆడడమంటే ఇష్టం అంటూ ఆర్సీబీ జట్టుపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రియాంష్ కామెంట్స్ పై ఆర్సీబీ స్పందించనప్పటికీ ఆర్సీబీ వర్గాల సమాచారం మేరకు ఈ యంగ్ ప్లేయర్ని జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ కి ప్రియాంష్ తోడైతే జట్టుకు లాభం చేకూరనుందని పలువురు చెప్తున్నారు. ఇక తాను కొట్టిన ఆరు వరుస సిక్సర్ల గురించి ప్రియాంష్ ఆర్య మాట్లాడుతూ ఎడమ చేతి స్పిన్నర్ ఎవరైనా నాకు బౌలింగ్ చేయడానికి వస్తే నేను కచ్చితంగా అతడిని టార్గెట్ చేస్తానని చెప్పాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆయుష్ బడోని మరియు ప్రియాంష్ఆర్య అద్భుతమైన సెంచరీలు సాధించారు. వీరిద్దరి సెంచరీ కారణంగా సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 308 పరుగులు చేసింది. ప్రియాంష్ ఆర్య కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అలాగే అతని ఇన్నింగ్స్‌లో వరుసగా 6 సిక్సర్లు కొట్టాడు. ప్రియాంష్ ఆర్యతో పాటు ఆయుష్ బడోనీ 55 బంతుల్లో 165 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 19 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ప్రియాంష్ 9 ఇన్నింగ్స్‌లలో 75.25 సగటుతో మరియు 198.0 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 602 పరుగులు చేశాడు. ఈ సమయంలో 2 సెంచరీలు కూడా చేశాడు.
Also Read: Vijayawada Floods: వరద బాధితులకు విరాళాలు కోరిన సీఎం చంద్రబాబు
Related News
IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ వర్సెస్ సర్ఫరాజ్ ఖాన్
IND vs BAN Live Updates: కేఎల్ రాహుల్ 2014లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా, సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్పరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనుభవం పరంగా ఇద్దరిలో కెఎల్దే పైచేయి.