HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Russia Could Use Nuclear Weapons Putin Warns West

Nuclear Weapons : మా దేశం జోలికొస్తే అణుబాంబులు వేస్తాం : పుతిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికా సహా ఐరోపా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

  • Author : Pasha Date : 06-06-2024 - 8:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Putin Agrees To China Visit
Putin

Nuclear Weapons : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అమెరికా సహా ఐరోపా దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగితే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఆయన ప్రకటించారు. అణ్వాయుధాలను ప్రయోగించాలనే తపన తమకు లేదని.. ఆ దిశగా పరిస్థితులను క్రియేట్ చేస్తున్నది పశ్చిమ దేశాలే అని పుతిన్ స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలో తొలుత అణ్వాయుధాలను ఉపయోగించింది అమెరికానే.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణుబాంబులు వేసింది అమెరికానే’’ అని ఆయన గుర్తు చేశారు.  రష్యా సమగ్రతను కాపాడుకునేందుకు తాము దేనికైనా తెగిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తా సంస్థల సీనియర్ సంపాదకులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ సంచలన కామెంట్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యా దేశ అణు సిద్ధాంతం అనేది ఇతర దేశాలను బెదిరించేందుకు అనుమతించదని పుతిన్ తేల్చి చెప్పారు. కేవలం ఇతర దేశాల నుంచి ఇబ్బందులు ఎదురైన సందర్బాల్లోనే అణ్వస్త్రాలను(Nuclear Weapons) వాడాల్సి వస్తుందన్నారు.  ‘‘రష్యా అణ్వాయుధాలను వాడదనే అపోహ నుంచి పశ్చిమ దేశాలు బయటికి రావాలి. మా దేశాన్ని కాపాడుకునేందుకు మేం ఏదైనా చేస్తామని వాళ్లు గుర్తుంచుకోవాలి’’ అని పుతిన్ తెలిపారు. రష్యాను కవ్వించే చర్యలను అమెరికా, దాని మిత్రదేశాలు ఆపేయాలన్నారు.  లేదంటే తగిన పర్యవసానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Also Read :Teenmar Mallanna : విజయం దిశగా తీన్మార్ మల్లన్న.. 6వేలకుపైగా ఓట్ల ఆధిక్యం

నాటో కూటమి దేశాలపై దాడి చేసే ఆలోచనే తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. సామ్రాజ్యవాద ఎజెండాతో తాము పొరుగుదేశం ఉక్రెయిన్‌పై దాడి చేయలేదన్నారు. ఒకప్పుడు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్‌లోనే భాగంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. నాటో కూటమిపై దాడి చేసే ఉద్దేశంతోనే  ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిందనే ప్రచారం సరికాదన్నారు.  రష్యాకు హాని చేయడానికి ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని వాడుకునేందుకు అమెరికా లాంటి దేశాలకు తాము అవకాశం ఇవ్వబోమని పుతిన్ తేల్చి చెప్పారు.

Also Read : Chandrika Ravi: అరుదైన ఘనత.. అమెరికాలో రేడియో షోకు వ్యాఖ్యాతగా తొలి భారతీయ నటి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • nuclear weapons
  • putin
  • russia
  • Western Countries

Related News

Putin Vs Trump

అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

Russia: సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలుపెట్టింది. ఈ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి, అమెరికా సహా పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రష్యాను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కఠిన ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయం రష్యా ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపింది. అందుకే నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా డాలర్ చెల్లింపుల వ్యవస్థలోక

  • Whatsapp Black In Russia

    Whatsapp Black : రష్యాలో వాట్సాప్ బ్లాక్!

Latest News

  • డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రిక‌.. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరికి ఆ స‌మ‌స్య‌!!

  • ఐపీఎల్ 2026.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్!

  • టైర్ల‌పై ఉన్న నంబర్ల అర్థం తెలుసా? ఇది మీ భద్రతకు చాలా ముఖ్యం!

  • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

  • ఇజ్రాయెల్ ప్రధానికి క్యాన్స‌ర్‌.. నిజ‌మేనా?!

Trending News

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd