PM Modi US Visit: ఎల్లుండి అమెరికాకు ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ..?
ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారా లేదా అనేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ధృవీకరించలేదు. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 09:39 PM, Thu - 19 September 24

PM Modi US Visit: ప్రధాని మోదీ సెప్టెంబర్ 21 నుంచి అమెరికా (PM Modi US Visit) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఎక్కడికి వెళతారు..? ఎవరిని కలుస్తారు అనే సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో జరిగే నాలుగో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగం కూడా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో తెలిపింది. సమాచారాన్ని పంచుకుంటూ.. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అధ్యక్షుడు జో బిడెన్‌ను కూడా కలుస్తారు. ఈ సమావేశంలో భారత్, అమెరికాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించే అవకాశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు.
అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను కలుస్తారా లేదా అనేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ధృవీకరించలేదు. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల రెండో సారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌తో మోదీ భేటీ అయితే ఎలాంటి విషయాలపై చర్చిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు సెప్టెంబరు 23న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని ప్రసంగిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్‌తో క్వాడ్ సమ్మిట్‌కు హాజరుకావడమే కాకుండా ప్రధాని మోదీ తన నేపాలీ కౌంటర్ కెపి శర్మ ఓలీని న్యూయార్క్‌లోనే కలవవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.