Pakistan Inflation: పాకిస్తాన్ లో దిగజారుతున్న పరిస్థితులు.. రూ. 3000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర..!
పొరుగున ఉన్న పాకిస్థాన్ (Pakistan Inflation)లో కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఆర్థిక సంక్షోభాలు క్రమంగా దేశంలో సామాన్య ప్రజల వెన్ను విరుస్తున్నాయి.
- Author : Gopichand
Date : 03-10-2023 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Inflation: పొరుగున ఉన్న పాకిస్థాన్ (Pakistan Inflation)లో కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఆర్థిక సంక్షోభాలు క్రమంగా దేశంలో సామాన్య ప్రజల వెన్ను విరుస్తున్నాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒత్తిడితో ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది. $3 బిలియన్ల బెయిలవుట్ ప్యాకేజీని పొందడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత, ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల నమోదైంది. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం రేటు 31.44 శాతానికి పెరిగింది.
సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరిగింది
పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ద్రవ్యోల్బణం బ్లూమ్‌బెర్గ్ డేటా 30.94 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఆగస్టులో దేశంలో ద్రవ్యోల్బణం 27.40 శాతంగా ఉంది. లైవ్ మింట్ వార్తల ప్రకారం.. ఈ నెలలో కూడా ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
గమనించదగ్గ విషయం ఏమిటంటే.. అక్టోబర్ 30న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ సమావేశం జరగనుంది. ఇందులో వడ్డీ రేట్ల సమీక్ష ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బ్యాంక్ కొన్ని అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం రేటు జూన్ 2024 వరకు పెరుగుతూనే ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అంచనా వేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం దేశ సగటు ధరల వృద్ధి రేటు 20 నుండి 22 శాతం మధ్య ఉండవచ్చని అంచనా.
ద్రవ్యోల్బణం భారం ప్రజలపై పడుతోంది
జూలై నుంచి ప్రారంభమైన ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని స్వీకరించేందుకు సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలను పెంచాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. దీని తర్వాత దేశంలో రవాణా ధరలు ఏడాదికి 31.26 శాతం పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. ఆహార ద్రవ్యోల్బణం రేటు సంవత్సరానికి 33.11 శాతం పెరిగింది. ఇల్లు, నీరు, విద్యుత్ ధరలు 29.70 శాతం పెరిగాయి.
LPG గ్యాస్ సిలిండర్ రూ. 3000 కంటే ఎక్కువ
అక్టోబర్ 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (OGRA) LPG ధరను రూ. 246.16 పెంచింది. దీని తర్వాత ఒక LPG సిలిండర్ రూ. 3079.64కి చేరుకుంది.