North Korea Fires Missile: మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అణుపరీక్షకు సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా (North Korea) మళ్లీ క్షిపణులను పరీక్షించడం ప్రారంభించింది. గురువారం (మార్చి 9)కిమ్ జోంగ్ ఉన్ దేశం స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
- By Gopichand Published Date - 10:19 AM, Fri - 10 March 23

అణుపరీక్షకు సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా (North Korea) మళ్లీ క్షిపణులను పరీక్షించడం ప్రారంభించింది. గురువారం (మార్చి 9)కిమ్ జోంగ్ ఉన్ దేశం స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియా త్వరలో కలిసి సైనిక కసరత్తులు నిర్వహించబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఉత్తర కొరియా క్షిపణులను పరీక్షించడం ముప్పుగా పరిగణించబడుతుంది.
ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. పశ్చిమ తీర నగరం నంపో నుంచి స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. ఆ మిస్సైల్ ఎంత దూరం ప్రయాణించిందో వెల్లడించలేదు. అణు సామర్థ్యం కలిగిన B-52 బాంబర్ పరీక్షలను అమెరికా, దక్షిణకొరియా చేపట్టడంపై ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్ యో జోంగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Israel Shooting: ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పులు.. దుండగుడిని హతమార్చిన పోలీసులు
శత్రు వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేయడాన్ని అనుకరించే “ఫైర్ అసాల్ట్ డ్రిల్” సమయంలో కిమ్ ఏ ఆయుధాలను చూశాడో నివేదిక పేర్కొనలేదు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు బాగా లేవు. గత 2 సంవత్సరాలలో ఈ\దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గత సంవత్సరం మాత్రమే కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాను తిరుగులేని అణుశక్తిగా ప్రకటించాడు. వ్యూహాత్మక అణ్వాయుధాలతో సహా ఆయుధ ఉత్పత్తిని వేగంగా పెంచుతానని ప్రతిజ్ఞ చేశాడు. తన మిత్రుడైన దక్షిణ కొరియాను కాపాడుకునేందుకు అమెరికా ఈ ప్రాంతంలో మరింత దృష్టి సారిస్తోందని కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు.

Related News

Sperm Donor: స్పెర్మ్ డొనేషన్ ద్వారా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎక్కడంటే..?
ఈ రోజు మనం చెప్పబోయే వ్యక్తి స్పెర్మ్ డొనేషన్ (Sperm Donor) ద్వారా 550 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో నివసించే జొనథన్ ఎం(41) అనే వైద్యుడు.. వీర్యదానం ద్వారా 550 మందికి తండ్రి అయ్యాడు.