Israel Shooting: ఇజ్రాయెల్ రాజధానిలో కాల్పులు.. దుండగుడిని హతమార్చిన పోలీసులు
ఇజ్రాయెల్ (Israel) రాజధాని టెల్ అవీవ్‌లో గురువారం ఒక దుండగుడు బీభత్సం చేశాడు. ఇష్టానుసారంగా కాల్పులు (Shooting) జరిపి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో గురువారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు.
- By Gopichand Published Date - 07:24 AM, Fri - 10 March 23

ఇజ్రాయెల్ (Israel) రాజధాని టెల్ అవీవ్‌లో గురువారం ఒక దుండగుడు బీభత్సం చేశాడు. ఇష్టానుసారంగా కాల్పులు (Shooting) జరిపి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరంలో గురువారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అదే సమయంలో కాల్పులు జరిగిన వెంటనే ఇజ్రాయెల్ పోలీసులు దాడి చేసిన వ్యక్తిని హతమార్చారు. నగరం నడిబొడ్డున ప్రధాన రహదారిపై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Hamburg Shooting: జర్మనీలో కాల్పులు కలకలం.. ఏడుగురు మృతి
అనంతరం పెద్ద సంఖ్యలో పోలీసులు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి తర్వాత పోలీసు అధికారులు నిందితుడిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఉగ్రదాడి అని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సైనిక దాడిలో ముగ్గురు పాలస్తీనియన్లు మరణించిన కొన్ని గంటల తర్వాత ఈ కాల్పులు జరిగాయి.

Related News

Nisha Desai Biswal: భారత సంతతి మహిళ నిషా దేశాయ్ బిస్వాల్‌కు కీలక బాధ్యతలు.. ఎవరీ నిషా దేశాయ్..?
అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది. యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కమిషన్ డిప్యూటీ చీఫ్‌గా నిషా దేశాయ్ బిస్వాల్ (Nisha Desai Biswal)ను ఎంపిక చేస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.