HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >New Rules For The H 1b Visa

H-1B Visa: హెచ్‌-1బీ వీసాలో కొత్త నిబంధనలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 27-03-2026 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
H 1b Visa New Rules
H 1b Visa New Rules

H1B Visa Rules  అమెరికా డాలర్ డ్రీమ్స్ ప్రపంచంలోనే లక్షలాది మంది యువత కల. అక్కడ ఉన్నత విద్య, ఆపై ఉద్యోగం సంపాదించి స్థిరపడాలనే ఉద్దేశంతో అమెరికాకు విమానం ఎక్కుతారు. ఇక, ప్రతిభావంతులైన విదేశీ వర్కర్ల కోసం ఎలాగూ హెచ్-1 బీ వీసా ప్రోగ్రామ్ ఉండనే ఉంది. కానీ, ఈ ప్రోగ్రామ్ కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఐటీ సంస్థల్లో విదేశీ వర్కర్లను తగ్గించి స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పించే దిశగా అమెరికా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగానే హెచ్‌-1బీ వీసాదారుల వేతనాల పెంపునకు సంబంధించి కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే హెచ్-1బీ వీసాదారుల కనీస వార్షిక వేతనం 14వేల డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీయులకు వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల చౌకగా లభించే సిబ్బందివైపే సంస్థలు మొగ్గుచూపుతున్నాయని ఆందోళనలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే అమెరికా యంత్రాంగం తాజా ప్రతిపాదనలు తీసుకురావడం గమనార్హం. దీని వల్ల విదేశీ ఉద్యోగులకు గడ్డుకాలం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం స్థానిక ఉద్యోగులతో పోలిస్తే హెచ్‌-1బీ వీసాదారుల సగటు వార్షిక వేతనం 10,191 డాలర్లు తక్కువగానే ఉంది. కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగాల్లో ఈ తేడా మరింత ఎక్కువ కావడం గమనార్హం. వాస్తవానికి ప్రతిభావంతులైన విదేశీ వర్కర్లను నియమించుకోవడానికే హెచ్‌-1బీ వీసా విధానాన్ని అమెరికా తీసుకొచ్చింది. కానీ, అందుకు భిన్నంగా కొన్ని సంస్థలు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ తక్కువ వేతనానికి వచ్చే విదేశీ ఉద్యోగుల నియమాకాలు జరుపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 2024లో జారీ అయిన హెచ్‌-1బీ వీసాల్లో 63 శాతం మంది ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగులే ఉన్నట్లు గణాంకాలు తెలిపాయి.

ఈ దుర్వినియోగానికి చెక్ పెట్టేలా వేతన పెంపు ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడు సంతకం తర్వాత ఇవి అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ‘‘ప్రతిపాదిత నిబంధనల ప్రకారం నిర్దిష్ట వృత్తులు, స్థానిక ఉద్యోగ మార్కెట్ల ఆధారంగా వైట్-కాలర్ ఉద్యోగాలకు ప్రస్తుత వేతన స్థాయిలను సర్దుబాటు చేస్తారు’’ అని తెలిపింది. ఇప్పటికే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే.

తాజా ప్రతిపాదనల ప్రకారం లెవెల్‌ 1 ఉద్యోగాలకు కనీస వేతనం 17 నుంచి 34 శాతం, లెవెల్-2 సిబ్బందికి 34 నుంచి 52 శాతం, లెవెల్‌-3 వర్కర్లకు 52 నుంచి 70 శాతం, లెవెల్‌- 4 ఉద్యోగులకు 70 నుంచి 88 శాతం మేర పెంచనున్నారు. ఈ ప్రతిపాదనలతో H-1B వీసాదారుల వార్షిక సగటు వేతనం 14,000 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. దీంతో విదేశీ వర్కర్లను నియమించుకునే సంస్థలు ఏటా 6.56 బిలియన్ డాలర్ల వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది.

H-1B ఉద్యోగులు కీలకమైన నైపుణ్య లోపాలను భర్తీ చేస్తారని, మార్కెట్‌కు పోటీగా ఉండే వేతనాలను పొందుతారని వ్యాపార సంస్థలు వాదిస్తుండగా, ఔట్‌సోర్సింగ్, స్టాఫింగ్ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని, మార్కెట్ ధరల కంటే తక్కువ వేతనాలకు ఎంట్రీ లెవెల్ లేదా మధ్య స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సందర్భాలను విమర్శకులు ఎత్తి చూపుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు, టీసీఎస్ వంటి ఐటీ సేవల కంపెనీలు ఈ విధానాన్ని ప్రధానంగా వినియోగించుకున్నాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Donald Trump
  • H1B Visa
  • H1B Visa News
  • H1B Visa Rules
  • new rules
  • USA

Related News

Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రజలను “అబద్ధాలకోరులు, మోసగాళ్లు మరియు వికృత మనస్తత్వం గలవారు” అని అభివర్ణించారు. ఇరాన్‌కు చెందిన “అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల”పై అమెరికా దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో (NATO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట

  • Tragic accident in the US: Young woman from NTR district dies.

    Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

  • Celebrations of America's 250th Independence Day

    Donald Trump: అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు

  • Shah Rukh Khan's Knight Riders to set up own cricket stadium in the US.

    Shah Rukh Khan: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు

Latest News

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd