Mexico Supreme Court: మెక్సికో తొలి మహిళా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నార్మా లుసియా
మెక్సీకో (Mexico)లో తొలిసారిగా ఓ మహిళ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ నార్మా లుసియా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో ఆమె విజయం సాధించారు.
- Author : Gopichand
Date : 04-01-2023 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
మెక్సీకో (Mexico)లో తొలిసారిగా ఓ మహిళ సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ నార్మా లుసియా (Justice Norma Lucia Pina) ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో ఆమె విజయం సాధించారు. సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రను కాపాడేందుకు తనవంతుగా నిజాయితీతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
మెక్సికో సుప్రీంకోర్టు చరిత్రలో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం స్వాతంత్య్రాన్ని సమర్థిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ 11 మంది సభ్యుల న్యాయస్థానం అధిపతిగా జస్టిస్ నార్మా లూసియా పినా నాలుగు సంవత్సరాల పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ శాఖల మధ్య విభేదాలను పరిష్కరించడానికి న్యాయ స్వాతంత్య్రం చాలా అవసరం అని పినా తన ప్రణాళికలను వివరిస్తూ చెప్పారు.”నా ప్రధాన ప్రతిపాదన నా వ్యక్తిగత దృష్టిని పక్కన పెట్టి మెజారిటీని ఏర్పరచడానికి కృషి చేయడమే అని తెలిపారు.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా ఈజ్ బ్యాక్
ప్రధాన న్యాయమూర్తిగా పినా మొత్తం న్యాయ శాఖకు అధిపతిగా కూడా ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు అతని ఎన్నికను స్వాగతించాయి. ఈ పదవి కోసం ఆమెతో పాటు మరో న్యాయమూర్తి పోటీపడ్డారు. దాంతో ఓటింగ్ నిర్వహించారు. జస్టిస్ నార్మ 6-5 మెజారీటీతో జస్టిస్ యాస్మిన్ ఎస్క్వివెల్‌పై విజయం సాధించారు. జస్టిస్ యాస్మిన్ పేరును దేశాధ్యక్షుడు అండ్రెస్ మాన్యుఎల్ లొపెజ్ ప్రతిపాదించారు. అయితే.. జస్టిస్ యాస్మిన్‌పై డిగ్రీ సర్టిఫికెట్ కోసం నకిలీ పేపర్ సమర్పించింది అనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ఓటింగ్ ఆమెకు అనుకూలంగా రాలేదు.