HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Jasprit Bumrah Included In Odi Squad For Sri Lanka Series

Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా ఈజ్ బ్యాక్

జనవరి 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాలో భారీ మార్పు చోటు చేసుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా బుమ్రా సెప్టెంబర్, 2022 నుంచి టీమ్ ఇండియాకు దూరమయ్యాడు.

  • By Gopichand Published Date - 06:31 AM, Wed - 4 January 23
  • daily-hunt
Bumrah On Fire
Bumrah On Fire

జనవరి 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాలో భారీ మార్పు చోటు చేసుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా బుమ్రా సెప్టెంబర్, 2022 నుంచి టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. అయితే.. ఇప్పుడు బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. శ్రీలంకతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చింది.

ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్‌కు ఇది అతిపెద్ద శుభవార్త. ఎందుకంటే బుమ్రా చాలా కాలంగా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. శ్రీలంకతో జరగనున్న 3 వన్డేల సిరీస్‌కు భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను భారత సీనియర్ సెలక్షన్ కమిటీ చేర్చిందని బీసీసీఐ మీడియా ప్రకటన విడుదల చేసింది. ”శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత జట్టులోకి పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చేర్చింది” అని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.

బుమ్రా సెప్టెంబర్, 2022 నుండి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను వెన్ను గాయం కారణంగా ICC పురుషుల 2022 T20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు. ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ తిరిగి గాయం నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) చేత ఫిట్‌గా ప్రకటించబడ్డాడు. దింతో బుమ్రా కొద్దిరోజుల్లో టీమిండియా వన్డే జట్టులో చేరనున్నాడు.

Also Read: India Beat SL: అదరగొట్టిన శివమ్ మావి తొలి టీ ట్వంటీ భారత్‌దే

శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WK), ఇషాన్ కిషన్ (WK), హార్దిక్ పాండ్యా (VC), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్.

NEWS – The All-India Senior Selection Committee has included pacer Jasprit Bumrah in India’s ODI squad for the upcoming Mastercard 3-match ODI series against Sri Lanka.

More details here – https://t.co/hIoAKbDnLA #INDvSL #TeamIndia

— BCCI (@BCCI) January 3, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • bumrah
  • Ind vs SL
  • Jasprit Bumrah
  • ODI series
  • SL
  • TeamIndia

Related News

BCCI

BCCI: టీమిండియాకు 21 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రకటించిన బీసీసీఐ!

దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.

  • BCCI

    BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

  • IND vs SL

    IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

  • Karun Nair

    BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

  • Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ క్రికెట్ నుండి ఎందుకు విరామం తీసుకున్నాడు?

Latest News

  • Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!

  • 42% BC Reservation G.O : రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయానికి బిఆర్ఎస్ అడ్డు..

  • Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

  • Mirai Movie: ‘మిరాయ్’ తో నిర్మాతకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో తెలుసా..?

  • Alcohol Fact: మద్యం తాగిన తర్వాత ఆకలి ఎందుకు వేస్తుందో తెలుసా..?

Trending News

    • Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకుల సెలవుల పూర్తి జాబితా ఇదే!

    • IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్ పోరులో విజేత ఎవ‌రంటే?

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd