Eats Wife’s Brain: మెక్సికోలో షాకింగ్ ఘటన.. భార్యను హత్య చేసి మెదడు తిన్న భర్త
మెక్సికోలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అల్వారో అనే 32 ఏళ్ల వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. దీని తర్వాత అతను తన భార్య మెదడును బ్రెడ్ (Eats Wife's Brain)తో తిన్నాడు.
- Author : Gopichand
Date : 09-07-2023 - 6:47 IST
Published By : Hashtagu Telugu Desk
Eats Wife’s Brain: మెక్సికోలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అల్వారో అనే 32 ఏళ్ల వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. దీని తర్వాత అతను తన భార్య మెదడును బ్రెడ్ (Eats Wife’s Brain)తో తిన్నాడు. ఈ కేసులో అల్వారోను అరెస్టు చేశారు. 32 ఏళ్ల వ్యక్తిని జూలై 2న ప్యూబ్లోలోని అతని ఇంటిలో అరెస్టు చేసినట్లు ది మిర్రర్ నివేదించింది. అల్వారో వృత్తిరీత్యా బిల్డర్. జూన్ 29న నిషేధిత మత్తుమందు తాగి ఆ తర్వాత మద్యం మత్తులో భార్యను హతమార్చాడు. శాంటా ముర్టే (అవర్ లేడీ ఆఫ్ హోలీ డెత్) డెవిల్ తనను నేరం చేయమని ఆదేశించారని నిందితుడు పోలీసులకు చెప్పాడు.
మెక్సికోకు చెందిన అల్వారో ఏడాది క్రితమే 38 ఏళ్ల మరియా మోంట్‌సెరాట్‌ను వివాహం చేసుకున్నారు. అతని భార్యకు ఇప్పటికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి వయస్సు 12- 23 సంవత్సరాల మధ్య ఉంటుంది. నిందితుడు తన భార్య మెదడులోని భాగాన్ని టాకోస్‌లో తిన్నాడని, ఆమె పగిలిన పుర్రెను ఆష్‌ట్రేగా ఉపయోగించినట్లు అంగీకరించాడని మిర్రర్ నివేదిక పేర్కొంది. బాధితురాలి మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్లాస్టిక్ సంచిలో పెట్టాడు. హత్య చేసిన రెండు రోజుల తర్వాత నిందితుడు తన సవతి కూతురును పిలిచి నేరం ఒప్పుకున్నాడు.
Also Read: Tomato Thieves: చోరీకి గురవుతున్న టమోటా పంట ఆందోళనలో రైతులు
బాధితురాలి తల్లి పోలీసులకు సమాచారం ఇస్తూ.. అల్లుడు తన కూతురు మృతదేహాన్ని ఉలి, సుత్తితో నరికి చంపాడని తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. హత్యకు ముందు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం వక్తం చేసింది. అల్లుడు బహుశా కొన్ని మానసిక సమస్యలను కూడా కలిగి ఉన్నాడు. వాటితో అతను బాధపడుతున్నాడని తెలిపింది. బాధితురాలి కుమార్తెలపై అల్లుడు శారీరకంగా, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా విచారణలో పోలీసులు అతని ఇంట్లో చేతబడి బలిపీఠాన్ని కూడా కనుగొన్నారు. అతడు మానసిక రోగి కావచ్చని, అందుకే ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటాడని స్థానిక మీడియాకు ఆమె తెలిపింది.