HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Many Countries Strongly Condemned The Us Action

అమెరికా చర్యను తీవ్రంగా ఖండించిన పలు దేశాలు

అమెరికా చేపట్టిన చర్యలు వెనెజులా రాజకీయ స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Author : Latha Suma Date : 04-01-2026 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Many countries strongly condemned the US action
Many countries strongly condemned the US action

. ఇది సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించిన రష్యా, ఇరాన్, క్యూబా

. వెంటనే ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్

. వెనెజులా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసిన రష్యా

Venezuela : శనివారం వెనెజులాపై అమెరికా భారీ స్థాయిలో సైనిక దాడికి పాల్పడిందన్న వార్తలు అంతర్జాతీయ వేదికపై కలకలం రేపాయి. ఈ ఆపరేషన్‌లో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా చేపట్టిన చర్యలు వెనెజులా రాజకీయ స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడి లక్ష్యం ఏమిటి? దాని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి.

అమెరికా సైనిక చర్యను రష్యా తీవ్రంగా ఖండించింది. వెనెజులా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఇది బహిరంగంగా ఉల్లంఘించడమేనని రష్యా విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. “ఇలాంటి దాడులకు చెప్పే కారణాలు నిలకడలేనివి. కేవలం సైద్ధాంతిక శత్రుత్వమే ఈ చర్యకు కారణం. లాటిన్ అమెరికా ప్రాంతం శాంతి క్షేత్రంగా కొనసాగాలి. వెనెజులా తన భవిష్యత్తును తానే నిర్ణయించుకునే హక్కు కలిగి ఉంది” అని రష్యా స్పష్టం చేసింది. ఈ అంశంపై తక్షణమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలన్న వెనెజులా డిమాండ్‌కు రష్యా పూర్తి మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో క్యూబా అధ్యక్షుడు మిగ్యూల్ డియాజ్-కెనెల్ ఈ దాడిని “నేరపూరిత చర్య”గా అభివర్ణించారు. ఇది వెనెజులా ప్రజలపై జరుగుతున్న అగ్రరాజ్య ఉగ్రవాదమని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ కూడా అమెరికా చర్యను పిరికిపంద దాడిగా విమర్శించారు.

అమెరికా దాడిపై ఇరాన్ విదేశాంగ శాఖ కూడా ఘాటుగా స్పందించింది. ఇది స్పష్టమైన దురాక్రమణ చర్యగా పేర్కొంటూ, ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. వెనెజులాకు తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా చేపట్టిన “దండయాత్రను” తక్షణమే నిలిపివేయాలని, ఇందుకు అంతర్జాతీయ సమాజం తన చట్టపరమైన, నైతిక బాధ్యతను నిర్వర్తించాలని ఇరాన్ పిలుపునిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వెనెజులా పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందన్నది, ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమెరికా చర్యలు ప్రాంతీయ శాంతి, ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపై అంతర్జాతీయ సమాజం కళ్లప్పగించి చూస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cuba
  • Donald Trump
  • International Relations
  • Iran
  • Military Attack
  • Nicolas Maduro
  • russia
  • sovereignty
  • United States
  • Venezuela

Related News

Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రజలను “అబద్ధాలకోరులు, మోసగాళ్లు మరియు వికృత మనస్తత్వం గలవారు” అని అభివర్ణించారు. ఇరాన్‌కు చెందిన “అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల”పై అమెరికా దాడి చేసిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో (NATO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట

  • The Strait of Hormuz is once again in turmoil. How will this impact the Iran-US peace agreement?

    Hormuz crisis: హోర్ముజ్ జలసంధి మరోసారి అట్టుడికిపోతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

  • Trump warns China over Panama Canal: We will not allow it.

    Donald Trump: పనామా కాలువ విషయంలో చైనాను హెచ్చరించిన ట్రంప్: దీనిని మేము అనుమతించము.

Latest News

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

  • Shiv Sena: థానే ఆసుపత్రిలో మహిళా డాక్టర్, సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ దాడి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd