Elon Musk’s Twitter: ఆఫీసులోనే నిద్రిస్తున్న ట్విట్టర్ ఉద్యోగులు
ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు కీలక
- By Gopichand Published Date - 05:48 PM, Thu - 3 November 22

ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు కీలక అధికారులను తొలగించిన మస్క్.. కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లను రోజుకు 12 గంటలు పనిచేయాలని హుకుం జారీ చేశారు. అదేవిధంగా ఏడు రోజులూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరికలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ లో ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ట్విట్టర్ లో పని చేస్తున్న ఓ మేనేజర్ ఆఫీసులో పని చేసి చేసి.. ఇంటికి వెళ్లే సమయం లేక.. అక్కడ నిద్రపోయింది. దీనిని ఓ ట్విట్టర్ ఉద్యోగి షేర్ చేయడం గమనార్హం. స్లీపింగ్ బ్యాగ్ లో దూరి.. ఆఫీసులో టేబుల్, చైర్ల వెనక పడుకోవడం గమనార్హం.
మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టాక ఉద్యోగులపై ఒత్తిడి ఎక్కువైనట్లు తెలిసింది. ఓ ఉద్యోగి రాత్రివేళ ఆఫీసులోనే నిద్రిస్తున్న ఫొటో వైరలవుతోంది. బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు వసూలు చేయాలని మస్క్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనిని వారంలోగా పూర్తి చేయాలని.. లేదంటే తొలగిస్తామని మస్క్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు రోజుకు 12 గంటలకు పైనే పనిచేస్తూ.. కొందరు ఆఫీసులోనే నిద్రిస్తున్నట్లు తెలుస్తోంది.