Kamala Harris: గాజాలో కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కమలా హారిస్ బరిలో నిలిచింది. ఆమె తాజాగా గాజాలో కాల్పుల విరమణను పాటించాలని కోరుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. కమలా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
- Author : Praveen Aluthuru
Date : 26-07-2024 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
Kamala Harris: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా ప్రజలు అల్లాడిపోయారు. వేలాది మంది ప్రజలు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు.
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విదేశాంగ విధానంపై తొలి వ్యాఖ్యలు చేశారు. వైస్ ప్రెసిడెంట్ హారిస్ మాట్లాడుతూ..ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని పిలుపునిచ్చారు ఆమె. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశం తర్వాత హారిస్ విలేకరులతో మాట్లాడుతూ “ఈ ఒప్పందాన్ని పూర్తి చేద్దామని, తద్వారా మేము కాల్పుల విరమణను అమలు చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కాగా డెమొక్రాటిక్ అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత విదేశాంగ విధాన సమస్యపై హారిస్ చేసిన మొదటి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వచ్చే ఎన్నికల రేసు నుండి తప్పుకున్నారు. ఆ నేపథ్యంలో కమలా హారిస్ బరిలో నిలిచింది. ఇదిలా ఉండగా అమెరికాను పాలించే అర్హత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు లేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శిస్తున్నారు.
కాగా గాజాలో కాల్పుల విరమణను పాటించాలని భారత్ మొదటినుంచి పిలుపునిస్తోన్న సంగతి తెలిసిందే. మాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమింపజేసేందుకు అమెరికా సహా పశ్చిమ దేశాలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read: IND W vs BAN W: ఆసియా కప్ సెమీ-ఫైనల్స్ నేడే, బంగ్లాదేశ్‌తో టీమిండియా ఢీ