HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Movie Reviews
  • >Srivishnu Mrityunjay Movie Review

శ్రీవిష్ణు మృత్యుంజయ్‌ మూవీ రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 06-03-2026 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mrithyunjay Movie Review
Mrithyunjay Movie Review

Mrithyunjay Movie Review And Rating  శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ ఎంత బావుంటుందో, కంటెంట్ సెలక్షన్‌ కూడా అంతే బావుంటుంది. ముఖ్యంగా కెరీర్ తొలినాళ్లలో శ్రీవిష్ణు చేసిన ప్రతి సినిమాలోనూ కంటెంట్ చాలా బావుండేది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఫుల్ ఫన్ , ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చేస్తున్నాడు. గత వారమే ‘విష్ణు విన్యాసం’ సినిమాతో ఆడియన్స్‌ని పలకరించిన శ్రీవిష్ణు.. వారం గ్యాప్‌లోనే మృత్యుంజయ్ సినిమాతో వచ్చాడు. మార్చి 6న (శుక్రవారం) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రెస్ షో నేడు జరిగింది. మరి సినిమా ఎలా ఉంది..? కామెడీని కాదని శ్రీవిష్ణు చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

కథలో కంటెంట్ ఇదే
ఒక వార్తాపత్రికలో అడ్వర్టైజ్‌మెంట్ సెక్షన్‌లో పని చేస్తుంటాడు జయ్ (శ్రీవిష్ణు).. పూర్తి పేరు మృత్యుంజయ్. ఎప్పటికైనా గొప్ప క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది జయ్ కల. పేపర్ చదివే వాళ్ల సంఖ్యే తగ్గిపోతుందంటే అందులో యాడ్స్ తీసుకురావడమనేది ఇంకా కష్టమైన పని. కానీ తన తెలివితేటలతో వినూత్నమైన ఐడియాలతో చావు ఇళ్లకి వెళ్లి మరీ వాళ్ల చేత పేపర్‌లో శ్రద్ధాంజలి యాడ్స్ వేయించేలా చేస్తుంటాడు జయ్. ఆ క్రమంలో ఒక చావు ఇంటికి వెళ్తాడు. అచ్యుత్ రావ్ (బాల ఆదిత్య) అనే వ్యక్తి అనుకోని విధంగా కరెంట్ షాక్ కొట్టి చనిపోతాడు.

అసలు తన తండ్రికి ఏమైందో తెలియక అచ్యుత్ కూతురు అంజలి దీనంగా కూర్చొని ఉంటుంది. ఈ సన్నివేశం జయ్‌ని కదిలిస్తుంది. తన తండ్రి మరణానికి గల కారణమేంటో కనుక్కుంటానని అంజలికి మాటిస్తాడు. అయితే ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే అదే రీతిలో మరొక వ్యక్తి కూడా చనిపోతాడు. ఈ రెండు చావులకి వెళ్లిన జయ్‌కి ఇవి యాక్సిడెంట్స్ కాదు హత్యలు అనే అనుమానం వస్తుంది. పక్కా పథకం ప్రకారం ఎవరో వీళ్లిద్దరినీ చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారనే డౌట్ వస్తుంది.

అక్కడ మొదలైన జయ్ ఇన్వెస్టిగేషన్ చివరికి ఆ ఇద్దరి చావుల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడని కనిపెట్టే వరకూ వెళ్తుంది. ఓవైపు పోలీసులు ఈ చావులు యాక్సిడెంట్ అని చెప్తుంటే జయ్ మాత్రం ఖచ్చితంగా హత్యలనే కోణంలోనే తన ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మరి ఈ చావుల వెనకాల ఉన్న ఆ కనిపించని నీడ ఎవరు..? అతన్ని జయ్ పట్టుకున్నాడా? ఈ కేసుల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏసీపీ సీత పరశురాం (రెబా జాన్)కి జయ్ ఎలా సాయపడ్డాడు..? అసలు ఈ కేసులు ఎలా కొలిక్కి వచ్చాయన్నది మిగిలిన కథ.

హీరో Vs విలన్
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైన స్క్రీన్‌ప్లే.. సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి ఉత్కంఠ కలిగించే విధంగా కథ ఉంటే.. ఖచ్చితంగా థ్రిల్లర్ హిట్ అయినట్లే. ఈ రెండు పాయింట్లని డైరెక్టర్ గట్టిగానే పట్టుకున్నాడు. సినిమా మొదలై ఎప్పుడైతే ఆ ఇద్దరి చావులకి ఒక కనెక్షన్ ఉందని జయ్ కనిపెడతాడో అక్కడి నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది.

పోలీసులకి కూడా దొరక్కుండా కనీసం చిన్న క్లూ కూడా ఇవ్వకుండా పక్కా కొలతలతో హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్ ఓవైపు.. ప్రతి విషయాన్ని ఎవరూ చూడని కోణంలో చూస్తూ ఇన్వెస్టిగేషన్ చేసే హీరో మరోవైపు.. ఇలా ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠని కలగజేశాయి. ముఖ్యంగా హీరోకి విలన్‌కి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగే మైండ్ గేమ్.. దెబ్బా దెబ్బా అన్నట్లుగా నడిచే స్క్రీన్‌ప్లే మృత్యుంజయ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లింది.

హీరో పనితనం తెలియాలంటే ప్రత్యర్థి కూడా అంతే బలంగా ఉండాలి. ఈ సూత్రాన్ని ఫాలో అయితే ఆటోమేటిక్‌గా ఆ ఇంటెన్స్ డ్రామా ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. ఉదాహరణకి అతడు సినిమాలో మహేష్ బాబు-సోనూసూద్ మధ్య అలానే జులాయి సినిమాలో అల్లు అర్జున్-సోనూసూద్ మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎత్తులు అన్నీ ఎలాగైతే ఆడియన్స్‌ని కట్టిపడేశాయో.. ఆ రేంజులోనే ఈ చిత్రంలో కూడా హీరో-విలన్ మధ్య సీన్లు నడిచాయి.

ప్రీ ఇంటర్వెల్‌ బ్లాక్‌లో ఒకరికొకరు హీరో-విలన్ తెలీకుండా ఎదురుపడే సీన్ దగ్గరి నుంచి ఇంటర్వెల్ బ్లాక్.. సెకండాఫ్‌లో హీరోని విలన్ వెంటాడటం.. వెంటాడుతున్న విలన్‌ని గమనించకుండా జయ్ కనిపించని ఆ కిల్లర్‌ని వెతకడం ఇలా ఈ సీక్వెన్స్ అంతా క్లైమాక్స్ వరకూ అంతే ఇంటెన్సిటీతో సాగింది. ఇక క్లైమాక్స్‌లో కూడా హీరో-విలన్ మధ్య నడిచిన డైలాగ్స్.. సీన్లు అన్నీ ఆడియన్స్‌ని ఉత్కంఠకి గురిచేశాయి. ఇక సినిమాలో పాప సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయింది.

విలన్ యాక్టింగ్
ఈ సినిమాలో హీరో జయ్‌గా శ్రీవిష్ణు ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే కామెడీ సీక్వెన్స్ పెద్దగా లేకపోయినా ఈసారి సీరియస్ క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు అన్నీ సరిగ్గా సరిపోయాయ్. ఇక సినిమాలో విలన్ పాత్రలో నటించిన వీర్ ఆర్యన్ మాత్రం అదరగొట్టాడు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా కనిపిస్తూ.. చాలా ఈజీగా పక్కా ప్రణాళికతో మర్డర్లు చేసుకుంటూ వెళ్లే కిల్లర్ పాత్రలో జీవించాడు.

పోలీస్ ఆఫీసర్ సీత పాత్రలో రెబా జాన్ యాక్టింగ్ కూడా బావుంది. ఎక్కువగా సీరియస్‌గానే కనిపించే పాత్ర అయినా కూడా రెబా బాగా హ్యాండిల్ చేసింది. ఇక బాల ఆదిత్య, ఐశ్వర్య, సుదర్శన్, రచ్చరవి సహా మిగిలిన వారంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. కాల భైరవ మ్యూజిక్ ఈ సినిమాకి మరొక బలం. ఆ ఇంటెన్సిటీని, డ్రామాని క్రియేట్ చేయడంలో కాల భైరవ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయింది.

ఇక ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే కేవలం 2 గంటల్లోనే చాలా షార్ప్‌గా సినిమాని కట్ చేశారు. ఎక్కడా కూడా అనవసరమైన సీన్లు అనేవి కనిపించలేదు. అలానే కథ, కథనాన్ని దాటి ఎక్కడా బయటికి పోలేదు. హీరోయిన్-హీరో మధ్య లవ్ ట్రాక్ పెట్టాలని, సీరియస్‌గా సాగే ఇన్వెస్టిగేషన్ మధ్యలో కామెడీ ట్రాక్ కానీ ఇలా వేటి జోలీకి వెళ్లకుండా సబ్జెక్ట్‌కి కట్టుబడే సినిమాని తీయడంలో డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్‌ పనితనాన్ని మెచ్చుకోవాలి.

మనకి బాగా కావాల్సిన వాళ్లు పోతే ఏడ్చేయాలి.. లేకపోతే ఆ బాధ బరువైపోతుంది.. భరించలేని బరువైపోతుంది అంటూ సాగిన కొన్ని డైలాగులు, ఎమోషనల్ సీన్లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. మొత్తానికి మృత్యంజయ్ సినిమా అయితే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడే వాళ్లకి బాగానే నచ్చుతుంది. గత వారం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ వారం మాత్రం శ్రీవిష్ణు హిట్టు కొట్టినట్లే.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Movie Review And Rating
  • Mrithyunjay
  • Mrithyunjay Movie
  • Reba Monica John
  • Sree Vishnu

Related News

Saraswathi Review

వరలక్ష్మీ శరత్ కుమార్ సరస్వతి మూవీ రివ్యూ

Varalakshmi Sarathkumar  సరస్వతి అచ్చమైన తెలుగు పేరు. ఇప్పటికే తెలుగులో మేటి నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన సినిమా ‘సరస్వతి’. టీజర్, ట్రైలర్‌లతో పెద్ద సాహసమే చేయబోతుంది అని అనిపించిన ‘సరస్వతి’ నేడు (మార్చి 06) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా కథ, కథనాలేంటి? ప్రేక్షకుల్ని ఎంతవరకూ మెప్పించాయో సమీక్షలో చూద్దాం. తన కూతురుకి జరిగిన

    Latest News

    • తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు

    • Nitish Kumar : సీఎం పదవికి నితీశ్ రాజీనామా?

    • బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

    • Anasuya : ‘ఆంటీ’ అనగానే అనసూయ కు ఎక్కడో కాలింది !!

    • Gold Price Today on March 06th : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త.. భారీగా బంగారం, వెండి ధరలు

    Trending News

      • 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

      • పాకిస్థాన్ క్రికెట్‌ జట్టులో కలకలం!

      • పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?

      • ఇంగ్లాండ్‌తో భారత్ కీల‌క పోరు.. అభిషేక్ శ‌ర్మ‌కు నో ప్లేస్‌?!

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd