Kamala Harris: ఎన్నికలకు ముందే చరిత్ర సృష్టించిన కమలా హారిస్.. ఎలాగంటే..?
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో కమలా హారిస్ తలపడనున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
- By Gopichand Published Date - 08:28 AM, Sat - 3 August 24

Kamala Harris: ఈ ఏడాది చివర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అనుకోని సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి అమెరికాలో రాజకీయ వాతావరణం నెలకొంది. దేశ ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీ నుండి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇన్ని పరిణామాల మధ్య డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ (Kamala Harris) అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు.
ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో కమలా హారిస్ తలపడనున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన తొలి నల్లజాతి మహిళా అభ్యర్థిగా ఆమె నిలిచారు. అంతేకాకుండా ఆమె భారతీయ సంతతికి చెందిన మొదటి అధ్యక్ష అభ్యర్థి కూడా అయ్యారు.
Also Read: Manu Bhaker: స్వర్ణానికి అడుగు దూరంలో మను భాకర్..!
డెమోక్రటిక్ పార్టీలో కమల ఆధిక్యంలో ఉన్నారు
డెమోక్రటిక్ పార్టీలో నిన్న అధ్యక్ష అభ్యర్థికి జరిగిన ఎన్నికల్లో ఆమెకు మెజారిటీ వచ్చింది. డెమోక్రటిక్ నేషనల్ కమిటీ చీఫ్ జేమీ హారిసన్ మాట్లాడుతూ.. 4 వేల మంది ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారని, ఇందులో కమల మెజారిటీ సాధించారని చెప్పారు. ఈ ఫలితాలతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై కమల పోటీ చేయాలని నిర్ణయించారు. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలోకి దిగిన తొలి అమెరికన్ నల్లజాతి మహిళ, భారతీయ సంతతికి చెందిన అభ్యర్థి ఆమె అని అందరికీ తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
అభ్యర్థి కావడంపై కమల ఏం చెప్పింది?
ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు రావడంతో నేను గౌరవంగా భావిస్తున్నానని కమల అన్నారు. వచ్చే వారం నామినేషన్‌ను అధికారికంగా స్వీకరిస్తాను అన్నారు. కమల, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఫలితాలు వెల్లడికానున్నాయి.