Israel-Gaza Conflict: 5000 రాకెట్లతో దాడి.. ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్
గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ (Israel-Gaza Conflict) వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది.
- By Gopichand Published Date - 12:45 PM, Sat - 7 October 23

Israel-Gaza Conflict: గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ (Israel-Gaza Conflict) వైపు డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించారు. ఇది యుద్ధ పరిస్థితిని సృష్టించింది. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. దీనిని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం కూడా గాజా స్ట్రిప్‌లో వైమానిక దాడులు చేసింది.
హమాస్ ఉగ్రవాదుల దాడుల దృష్ట్యా ఇజ్రాయెల్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు హమాస్ ఉగ్రవాద సంస్థ ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాద సంస్థ గంట క్రితం దాడి చేసిందని ట్వీట్ చేసింది. వారు రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. హమాస్ ఉగ్రవాదులకు గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు.
Rockets firing hasn’t stopped since the morning! #Gaza pic.twitter.com/cw7U9acgPp
— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) October 7, 2023
CNN నివేదిక ప్రకారం.. దాడి తర్వాత ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాల్లో సైరన్‌లు మోగించాయి. టెల్ అవీవ్‌లోని డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్‌లో భద్రతను ప్రధాని, రక్షణ మంత్రి అంచనా వేస్తున్నారని ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. దీనితో పాటు ఇజ్రాయెల్ ప్రస్తుతం నివాసితులను ఇంటి లోపల ఉండాలని ఆదేశించింది.
Also Read: 2000 Rupees Note : 2వేల నోట్లు మార్చుకునే లాస్ట్ డే నేడే.. రేపటి నుంచి 2 ఆప్షన్లు
We’re now on WhatsApp. Click to Join.
అంతకుముందు, ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా “ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్” ప్రారంభించినట్లు ప్రకటించినందున, ఇజ్రాయెల్‌పై 5,000 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించామని పాలస్తీనాలోని టెరర్రిస్టు గ్రూప్ హమాస్ తెలిపింది. తాజా పరిస్థితులను చూస్తుంటే.. ఇజ్రాయెల్ సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పింది. సైన్యం తమ సైనికులకు ‘యుద్ధానికి సంసిద్ధత’ హెచ్చరిక జారీ చేసింది. దీనితో పాటు గాజాలోని విద్యా మంత్రిత్వ శాఖ ఈ రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
నిజానికి ఈ ప్రాంతంలో కనీసం 100 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, గోలన్ హైట్స్ వంటి ప్రాంతాలపై వివాదం ఉంది. తూర్పు జెరూసలేంతో సహా ఈ ప్రాంతాలపై పాలస్తీనా వాదిస్తోంది. అదే సమయంలో జెరూసలేంపై తన వాదనను వదులుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఇటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.