50 Women Kidnapped: బుర్కినా ఫాసోలో 50 మంది మహిళల కిడ్నాప్
బుర్కినా ఫాసోలో అనుమానిత జిహాదీలు మరోసారి భారీ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఇక్కడ ఉత్తర ప్రాంతంలో ఉన్న అరబింద ప్రాంతానికి చెందిన 50 మంది మహిళలను (50 Women Kidnapped) జిహాదీలు అపహరించి ఏదో తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.
- Author : Gopichand
Date : 17-01-2023 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
బుర్కినా ఫాసోలో అనుమానిత జిహాదీలు మరోసారి భారీ కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఇక్కడ ఉత్తర ప్రాంతంలో ఉన్న అరబింద ప్రాంతానికి చెందిన 50 మంది మహిళలను (50 Women Kidnapped) జిహాదీలు అపహరించి ఏదో తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. మహిళలను రెండు వర్గాలుగా విభజించి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఆహార కొరత కారణంగా, మహిళలు ఆకులు, అడవి పండ్లు సేకరించడానికి అడవికి వెళ్లారు. కొంతమంది మహిళలు జిహాదీల నుంచి తప్పించుకోగలిగారు. వారు విషయాన్ని వెల్లడించారు. మీడియా కథనాల ప్రకారం.. కిడ్నాప్ గురు, శుక్రవారాల్లో జరిగిందని, అయితే ఇప్పుడు వార్త తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం ఇస్లామిక్ ఉగ్రవాదం పట్టులో ఉందని చెబుతున్నారు. జిహాదీలు తమను చుట్టుముట్టడంతో మహిళలు తమ ఆహార అవసరాలను తీర్చుకోవడానికి పొదల్లోకి వెళ్లారని నివాసి ఒకరు చెప్పారు.
Also Read: Vijay Antony: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనికి తీవ్ర గాయాలు
మరో నివాసి మాట్లాడుతూ.. “గురువారం సాయంత్రం వారు తిరిగి రాకపోవడంతో వారి వాహనాలకు సమస్య ఉందని మేము అనుకున్నాము. అయితే ప్రాణాలతో బయటపడిన ముగ్గురు మాకు ఏమి జరిగిందో చెప్పారు. సహెల్ ప్రాంతంలోని అరబింద జిహాదీ తీవ్రవాదంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం. నగరానికి వెళ్లే, వచ్చే మార్గాలను జిహాదీలు దిగ్బంధించారు. ఆహార సరఫరాలు అంతంత మాత్రంగా ఉండడంతో తీవ్ర ఆకలి చావులు, ప్రజల పరిస్థితి అధ్వానంగా ఉంది.
గత నెల అరబిందలో నిరసనకారులు ఆహారం, సామాగ్రిని పొందేందుకు గోదాములను దోచుకున్నారు. బుర్కినా ఫాసో చాలా కాలంగా తీవ్రవాదం పట్టులో ఉంది. ఇస్లామిక్ ఛాందసవాదుల భీభత్సం ఇక్కడ నిరంతరం పెరుగుతోంది. ఇది ఒక దశాబ్దం పాటు తీవ్రవాదులచే ఆక్రమించబడింది. రెండు మిలియన్ల మంది ప్రజలను నిర్వాసితులను చేసింది. ఈ ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు గత ఏడాది జనవరిలో సైన్యం కూడా తిరుగుబాటు చేసినా హింసలు కొనసాగుతూనే ఉన్నాయి.