Indian Elections Vs Trump : బైడెన్ రూ.182 కోట్లు.. భారత్‌లో ఎవర్నో గెలిపించాలనుకున్నారు : ట్రంప్
భారత్‌లో ప్రతీసారి ఎన్నికల సమయంలో(Indian Elections Vs Trump) పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రూ.182 కోట్లను అమెరికా ప్రభుత్వం కేటాయిస్తోంది.
- By Pasha Published Date - 10:57 AM, Thu - 20 February 25

Indian Elections Vs Trump : భారత్‌లో ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందించే నిధులతో, ఏకంగా ఆ దేశ ప్రభుత్వాన్ని మార్చేందుకు మాజీ దేశాధ్యక్షుడు జో బైడెన్ యత్నించారని ట్రంప్ ఆరోపించారు. ‘‘భారత్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచాలనే తాపత్రయం మనకు ఎందుకు ? అందుకోసం మా దేశం(అమెరికా) రూ.182 కోట్లను ఎందుకు ఖర్చు పెట్టాలి ? బహుశా భారత దేశంలో మరెవర్నో గెలిపించేందుకు ఆ డబ్బును బైడెన్ సర్కారు ఖర్చు చేసి ఉండొచ్చు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పకుండా తెలియజేయాలి’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మియామీలో జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Surgical Infections: దడ పుట్టిస్తున్న సర్జికల్ ఇన్ఫెక్షన్లు.. సంచలన అధ్యయన నివేదిక
రద్దు చేసిన ‘డోజ్’
భారత్‌లో ప్రతీసారి ఎన్నికల సమయంలో(Indian Elections Vs Trump) పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రూ.182 కోట్లను అమెరికా ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ కేటాయింపును ఇటీవలే అమెరికా ప్రభుత్వంలోని ‘డోజ్’ విభాగం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ట్రంప్ కూడా సమర్ధించారు. అమెరికా సర్కారు దుబారా ఖర్చులకు కత్తెర పెట్టే లక్ష్యంతో ‘డోజ్’ విభాగం పనిచేస్తోంది. ఈ విభాగానికి ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Also Read :Ronan Law : భారత బాలుడి పేరుతో బ్రిటన్‌లో ‘రోనన్ లా’.. ఏమిటిది ? ఎవరీ రోనన్ ?
మాకైతే ఆ నిధులు రావడం లేదన్న బీజేపీ
‘‘ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా? ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? కచ్చితంగా అధికార బీజేపీకి ఆ నిధులు అందలేదు’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ఇటీవలే పోస్ట్ చేశారు. అంటే ఈ నిధులు భారత్‌లోని ఏ రాజకీయ పార్టీకి అందాయి ? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అమెరికా ప్రభుత్వం ఎన్నికల సమయంలో విడుదల చేస్తున్న రూ.182 కోట్లు ఎవరికి అందుతున్నాయి ? వాటిని ఏం చేస్తున్నారు ? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.