China: 50కిలోల కంటే తక్కువ బరువుంటే బయటకు రావొద్దు.. నిర్మానుష్యంగా మారిన బీజింగ్
50 కిలోల కంటే తక్కువ బరువు ఉంటే బయటకు రావొద్దు.. వచ్చారో గాలిలో కొట్టుకుపోతారు.
- By News Desk Published Date - 10:31 PM, Sat - 12 April 25

China: 50 కిలోల కంటే తక్కువ బరువు ఉంటే బయటకు రావొద్దు.. వచ్చారో గాలిలో కొట్టుకుపోతారు. సాధ్యమైనంత వరకు ఎవరూ రోడ్లపైకి రాకండి.. అంటూ చైనాలోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు చేశారు. అంతేకాదు.. విమాన సర్వీసులను రద్దు చేయడంతోపాటు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇంతకీ చైనాలో ఏం జరుగుతుందో అనుకుంటున్నారా..? మళ్లీ ఏమైనా కరోనా లాంటి వైరస్ వచ్చిందా అని భయాందోళన చెందుతున్నారా.. అలాంటిదేమీ లేదు. కానీ, ఉత్తర చైనా, బీజింగ్ లో భీకర పెనుగాలులు వీస్తుండటంతో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: WhatsApp: సోషల్ మీడియా యాప్స్‌కు ఏమైంది.. ఇప్పుడు వాట్సాప్ వంతు!
గత 50ఏళ్లలో ఎప్పుడూ లేనట్లుగా ఆదివారం వరకు బీజింగ్, టియాంజిన్‌తోపాటు హెబీలోని ఇతర ప్రాంతాలలో 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. భీకర గాలులు వీచే ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పర్యటక ప్రాంతాలు, చారిత్రక స్థలాలను మూసివేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు బీజింగ్ లోని రెండు ప్రధాన ఎయిర్ పోర్టుల నుంచి రాకపోకలు సాగించే 838 విమాన సర్వీసులు రద్దు చేశారు.
Also Read: AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్ ?!
పాఠశాలల తరగతులను తాత్కాలికంగా నిలిపివేశారు. బహిరంగ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. 50కిలోల కంటే తక్కువ బరువున్న వారు గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రజలను హెచ్చరించాయి. దీంతో బీజింగ్ లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నగరం అంతటా ఉన్న వేలాది చెట్లు ఈ గాలులకు పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్నిటి కొమ్మలు కత్తిరించారు. అయినప్పటికీ శనివారం సాయంత్రం వీచిన గాలులకు భారీ సంఖ్యలో చెట్లు కూలిపోయాయి.
Moments ago, Zhangjiakou, Hebei Province, China
Strong winds are sweeping through the region, bringing a sharp shift to the spring air pic.twitter.com/OkzGy0U7CX
— Weather Monitor (@WeatherMonitors) April 11, 2025
Strong winds caused electric scooters to be blown away as a powerful storm hit Guiyang, China. April 11, 2025 last night pic.twitter.com/WakwtRVWPt
— Weather Monitor (@WeatherMonitors) April 12, 2025
🇨🇳 Strongest Winds in Decade Hit North and Northeast China, Orange Alert Issued
According to Beijing weather station, gusts of wind will reach 41 m/s in places on Saturday.
Temperatures are also expected to plummet to 14 degrees Celsius, about 13 degrees lower than the previous… pic.twitter.com/kq9ev2UJB1
— dana (@dana916) April 12, 2025