Shooting At Gay Club: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
- By Gopichand Published Date - 05:22 PM, Sun - 20 November 22

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కొలరోడో రాష్ట్రంలోని ఓ నైట్ క్లబ్‌లో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అమెరికాలోని కొలరోడో స్ప్రింగ్స్‌లో విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి గే నైట్ క్లబ్‌లో ఓ దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లు ఓ వార్త సంస్థ పేర్కొంది.
ఈ కాల్పుల అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బలగాలు నైట్‌క్లబ్ నుంచి క్షతగాత్రులను తరలించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. సంఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, అంబులెన్స్‌లను మోహరించినట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌ఫోబియా కారణంగా హత్యకు గురైన వ్యక్తి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 20న యునైటెడ్ స్టేట్స్‌లో లింగమార్పిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ క్రమంలో కొలరోడో స్ప్రింగ్స్‌లోని క్లబ్ క్యూలో ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఇంతలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
US మీడియా నివేదికల ప్రకారం.. దుండగుడు స్నిపర్ రైఫిల్‌తో గే క్లబ్‌పై దాడి చేశాడు. నిందితుల దాడి వెనుక అసలు కారణం ఏమిటి..? ఘటనలో అసలు ఎంతమంది గాయపడ్డారు? దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు నవంబర్ 16న కొలంబియా క్లబ్ రోజ్ గోల్డ్‌లో కూడా కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ఒకరు మరణించారు.
DEVELOPING: Multiple people injured following reported shooting at gay nightclub in Colorado Springs, Colorado; massive police response underway
https://t.co/NuJlPKF1Od— Intel Point Alert (@IntelPointAlert) November 20, 2022