Elon Musk: అన్నంత పని చేసిన మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ ప్రకటన!
కొంతకాలం క్రితం వరకు మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికల కోసం ఆయన కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేశారు.
- By Gopichand Published Date - 10:17 AM, Sun - 6 July 25

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన ఎలన్ మస్క్ (Elon Musk) తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ శనివారం (జులై 05, 2025) అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ ఖర్చుతో కూడిన “వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్” కాంగ్రెస్‌లో ఆమోదం పొందిన సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొంతకాలం క్రితం వరకు మస్క్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికల కోసం ఆయన కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేశారు. కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య ముఖ్యంగా ట్రంప్ కొత్త ఖర్చు బిల్ విషయంలో విభేదాలు తలెత్తాయి. ఈ బిల్ వల్ల అమెరికాపై భారీ అప్పు పెరుగుతుందని మస్క్ అంటున్నారు. అయితే మస్క్ ప్రారంభించిన కొత్త పార్టీ పేరు అమెరికా పార్టీ అని తెలుస్తోంది.
Is this the America Party platform?
-reduce debt, responsible spending only
-modernize military with ai/robotics
-pro tech, accelerate to win in ai
-less regulation across board but especially in energy
-free speech
-pro natalist
-centrist policies everywhere elseIf so…
— Tyler Palmer (@tyler__palmer) July 5, 2025
అధ్యక్ష ఎన్నికల గురించి ఎలన్ మస్క్ ఏమన్నారు?
ఒక సోషల్ మీడియా యూజర్ మస్క్‌ను 2026 మధ్యంతర ఎన్నికలు లేదా 2028 అధ్యక్ష ఎన్నికలలో పాల్గొంటారా అని అడిగినప్పుడు.. మస్క్ ఇలా సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది (Next Year) అని అన్నారు.
Also Read: Alcohol Prices: మద్యం ప్రియులకు భారీ షాక్.. 50 శాతం ధరలు పెంపు, WHO కీలక ప్రకటన!
మస్క్ ప్రజలను ఈ ప్రశ్న అడిగారు?
దీనికి ఒక రోజు ముందు మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ఒక పోల్ నిర్వహించి కొత్త పార్టీ అవసరమా అని ప్రజలను అడిగారు. ఈ పోల్‌లో సుమారు రెండు రెట్లు ఎక్కువ మంది కొత్త పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.
ఆ తర్వాత మస్క్ ఇలా రాశారు. మీ స్వేచ్ఛను మీకు తిరిగి ఇచ్చేందుకు ఈ రోజు అమెరికా పార్టీ స్థాపించబడింది. అమెరికన్ రాజకీయాలలో డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలపై ప్రజల అసంతృప్తి పెరుగుతున్న సమయంలో మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మస్క్ స్వయంగా రాజకీయాల్లోకి దిగి ప్రతి ఒక్కరికి సేవ అందించాలనుకుంటున్నారు.
ట్రంప్ మస్క్‌కు హెచ్చరిక ఇచ్చారు
ఈ వారం ప్రారంభంలో డొనాల్డ్ ట్రంప్ మస్క్‌ను హెచ్చరిస్తూ అతను వ్యతిరేకతను కొనసాగిస్తే, అతని వ్యాపారాలకు ఇస్తున్న ఫెడరల్ సబ్సిడీలను ఉపసంహరించుకుంటామని, మస్క్‌ను అమెరికా నుండి డిపోర్ట్ చేస్తామని కూడా చెప్పారు.