Earthquake: ఇండోనేషియాలో భూకంపం.!
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.
- Author : Gopichand
Date : 06-11-2022 - 12:59 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీని ప్రేరేపించలేదని ఆ దేశ వాతావరణ విభాగం క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. జకార్తా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7:03 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం కెపులావాన్ సితారో జిల్లాకు నైరుతి దిశలో 69 కి.మీ, సముద్రగర్భం కింద 255 కి.మీ లోతులో ఉందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. సమీపంలోని ఉత్తర మలుకు ప్రావిన్స్‌లో కూడా భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని చెబుతూ ఏజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.