Pakistan PM Shehbaz: చైనాలో పర్యటించనున్న పాక్ ప్రధాని.. ఎప్పుడంటే..?
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే వారంలో చైనాలో పర్యటించనున్నారు.
- By Gopichand Published Date - 11:51 PM, Wed - 26 October 22

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే వారంలో చైనాలో పర్యటించనున్నారు. ప్రధాని లీ కెకియాంగ్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నవంబర్ 1న చైనాలో పర్యటించనున్నట్లు చైనా విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. 2022 ఏప్రిల్‌లో పాక్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చైనాలో షెహబాజ్ పర్యటించనుండటం ఇదే ప్రథమం. రెండురోజుల తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో బాటు పలువురితో ఆయన సమావేశమవుతారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొనసాంగిచడం, ప్రాంతీయ, ప్రపంచ పరిణామలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
రుణాలు, వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు లక్షల డాలర్లు చెల్లింపులతో అల్లాడుతున్న తరుణంలో షెహనాజ్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పాక్ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేసినా డబ్బులు అడుగుతారని అనుకుంటున్నారని, ప్రపంచం ముందు పాకిస్తాన్ బిచ్చగాడిలా నిల్చోందని అన్నారు. CPEC మరింత విస్తరణలో పాకిస్తాన్ 10,000 మెగావాట్ల సౌరశక్తితో నడిచే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి చైనా నుండి బహుళ బిలియన్ డాలర్ల ఫైనాన్సింగ్ విండోను కోరనుందని సమాచారం.
నవంబర్ 1వ తేదీన జరగనున్న తన బీజింగ్ పర్యటనకు సంబంధించిన ఎజెండాను సమీక్షించి ఖరారు చేసేందుకు షరీఫ్ బుధవారం సమావేశానికి అధ్యక్షత వహించిన నేపథ్యంలో ఇది జరిగింది. బిలియన్ల డాలర్ల విలువైన అనేక ప్రాజెక్టులు, కొత్త పథకాలకు ఆర్థిక సహాయం చేయడానికి చైనాను చేర్చుకోవాలని పాకిస్తాన్ చూస్తోంది. గ్వాదర్‌లో చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి చైనా, పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య త్రైపాక్షిక ఒప్పందం కూడా ఇందులో ఉందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.