Another 10000 Metre Hole : చైనాలో 10వేల మీటర్ల మరో రంధ్రం.. ఎందుకంటే ?
Another 10000 Metre Hole : ఇప్పటికే 10,000 మీటర్ల ఒక రంధ్రాన్ని తవ్వుతున్న చైనా.. ఇప్పుడు ఇంతే సైజున్న ఇంకో రంధ్రాన్ని తవ్వడం మొదలుపెట్టింది.
- Author : Pasha
Date : 21-07-2023 - 4:47 IST
Published By : Hashtagu Telugu Desk
Another 10000 Metre Hole : ఇప్పటికే 10,000 మీటర్ల ఒక రంధ్రాన్ని తవ్వుతున్న చైనా.. ఇప్పుడు ఇంతే సైజున్న ఇంకో రంధ్రాన్ని తవ్వడం మొదలుపెట్టింది. అయితే ఈసారి కూడా రంధ్రాన్ని షేల్ గ్యాస్, నేచురల్ గ్యాస్ నిక్షేపాల అన్వేషణ కోసమే తవ్వుతోంది. సిచువాన్ ప్రావిన్స్‌లోని షెండి చువాన్కే ప్రాంతంలో 10,520 మీటర్ల లోతున్న రంధ్రాన్ని డ్రిల్లింగ్ చేసే ప్రక్రియను చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ (CNPC) మొదలుపెట్టింది. రంధ్రం చేస్తున్న ప్రాంతంలోని భూగర్భంలో 145 మిలియన్ సంవత్సరాల కిందటి ప్రాచీన శిలలు ఉన్నాయని గుర్తించారు. అందుకే ఈ ప్రదేశంలో షేల్ గ్యాస్ నిక్షేపాలు బయటపడతాయనే ఆశాభావంతో చైనా సర్కారు ఉంది.
Also read : Rajagopal Reddy: బండి సంజయ్‌ని చూసి ఏడ్చేశా, రాజగోపాల్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్
కొత్త ఇంధన వనరుల కోసం అన్వేషించాలంటూ ఇటీవల కాలంలో చైనా ప్రభుత్వం తన పరిధిలోని ఇంధన కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అలుముకున్న ఇంధన సంక్షోభం కూడా దేశీయ ఇంధన వనరుల రీసెర్చ్ దిశగా చైనాను నడిపిస్తోంది. ఈ ఏడాది మే నెలలో షిన్ జియాంగ్ ప్రావిన్స్ లో మొదలైన 10,000 మీటర్ల పెద్ద బావి తవ్వకం పనులు కూడా CNPC కంపెనీకి సంబంధించినవే.
Also read : YSRCP MLA : ఏకంగా రూ.908 కోట్లకు టోకరా వేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి