China: చైనాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి
చైనాలో (China) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఢీకొనడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 49 వాహనాలు వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
- Author : Gopichand
Date : 06-02-2023 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
చైనాలో (China) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఢీకొనడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్‌జౌ హైవేపై 49 వాహనాలు వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 66 మంది గాయపడ్డారని ట్రాఫిక్ పోలీస్ శాఖ తెలిపింది.
Also Read: Chinese Apps Ban: మరో 232 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది మృతి చెందారు. ఈ మేరకు స్థానిక అధికారులు సమాచారం అందించారు. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మొత్తం 49 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. హునాన్ ప్రావిన్స్‌లోని హైవే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం జరిగిందని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. ఈ ప్రమాదాల్లో 66 మంది కూడా గాయపడ్డారు. వారిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారి పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ సహాయక చర్యల కోసం ప్రమాద స్థలానికి టాస్క్‌ఫోర్స్‌ను పంపింది. గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రులకు పంపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.