Jet Crash: ఘోర ప్రమాదం.. స్కూల్ బిల్డింగ్‌పై కూలిన విమానం, వీడియో ఇదే!
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ, ఫైర్ సర్వీస్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
- By Gopichand Published Date - 02:58 PM, Mon - 21 July 25

Jet Crash: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలో ఈరోజు ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7 బీజీఐ శిక్షణ విమానం (Jet Crash) ఒక స్కూల్ భవనంపై కూలిపోయింది. ఈ ఘటన మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ డయాబరీ క్యాంపస్‌లోని ఒక భవనంపై జరిగింది. ప్రమాద సమయంలో స్కూల్‌లో విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాద వివరాలు
విమానం కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఆకాశంలోకి వ్యాపించింది. టెలివిజన్ ఫుటేజ్‌లో ప్రమాద స్థలం నుంచి మంటలు, పొగ స్పష్టంగా కనిపించాయి. ఫైర్ సర్వీస్ అధికారి లిమా ఖాన్ ఒక వ్యక్తి మరణించినట్లు, నలుగురు గాయపడినట్లు ధృవీకరించారు. అయితే స్థానిక మీడియా నివేదికల ప్రకారం విద్యార్థులతో సహా కనీసం 10 మంది మరణించినట్లు, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
Also Read: PM Modi: నాలుగు రోజులపాటు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎప్పటినుంచి అంటే?
VIDEO | Dhaka: Bangladesh Air Force training jet crashes into a school in Dhaka, killing at least one person, fire official says. More details awaited.
(Source: PTI Videos) pic.twitter.com/bzXMGqJTEE
— Press Trust of India (@PTI_News) July 21, 2025
సహాయక చర్యలు, ప్రస్తుత పరిస్థితి
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ, ఫైర్ సర్వీస్, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఉత్తరా, టోంగీ, పల్లబీ, కుర్మిటోలా, మీర్‌పూర్, పుర్బాచల్ ఫైర్ స్టేషన్‌ల నుండి ఎనిమిది ఫైర్‌ఫైటింగ్ యూనిట్లు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Bangladesh Air Force China Made FT-7BGI (training) aircraft, tail no. 701, crashes in Uttara near Milestone College. 1:06pm and crashed into the college campus soon after.
Casualties : at least 6-7 min. pic.twitter.com/0vg4bvjD86
— (((Bharat)))🚨™️🕉🚩🔱 🇮🇳 🇮🇱🇷🇺🇺🇸🎗 (@Topi1465795) July 21, 2025
ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలాగే విమానం పైలట్ పరిస్థితి గురించి కూడా స్పష్టమైన సమాచారం లేదు. కొన్ని కథనాల ప్రకారం పైలట్ మృతిచెందినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన ఢాకాలో తీవ్ర విషాదం నింపింది.