Car Accident : జనంపైకి దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి.. 43 మందికి గాయాలు
ఈ ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Car Accident) క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికార వర్గాలను ఆదేశించారు.
- By Pasha Published Date - 09:50 PM, Tue - 12 November 24

Car Accident : చైనాలో ఘోరం జరిగింది. జుహై నగరంలోని ఓ స్పోర్ట్స్ సెంటర్ వద్ద కారు అతివేగంతో జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 35మంది ప్రాణాలు కోల్పోగా, 43మందికి గాయాలయ్యాయి. 62 ఏళ్ల డ్రైవర్ అతివేగంతో కారును నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. అతడిని ఇప్పటికే అరెస్టు చేశారు.
Also Read :Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Car Accident) క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికార వర్గాలను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అయితే ఇది కుట్రపూరితంగా జరిగిన ఘటనా ? ప్రమాదమా ? అనే దానిపై పూర్తిస్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియోను లీ యాంగ్ అనే న్యూస్ బ్లాగర్ షేర్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఒక వ్యక్తికి సీపీఆర్ చేస్తున్నట్లు అందులో ఉంది. డజన్ల కొద్దీ మంది రన్నింగ్ ట్రాక్‌పై పడిపోయి ఉండటం ఆ వీడియోలో కనిపించింది.
Also Read :Train Owner : ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్ అయిన రైతు.. ఎలా అంటే ?
జుహైలో ఈరోజు ఎయిర్ షో ప్రారంభమైంది. అందుకే సోమవారం రాత్రి జరిగిన కారు ప్రమాదం వివరాలు మీడియాలో పబ్లిష్ కాకుండా చైనా ప్రభుత్వం సెన్సార్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వివరాలు బయటికి వస్తే.. ఎయిర్ షో జరుగుతున్న వేళ జుహై ప్రాంత ఇమేజ్ దెబ్బతింటుందని, ప్రజలు భయాందోళనలకు గురవుతారని చైనా సర్కారు భావించి ఉంటుందని అంటున్నారు. ఇక చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘వీబో’లో కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన కేవలం ఒకటి, రెండు వీడియోలే ఉన్నాయి.