HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Appsc Group 2 Mains Exam Postponed To 2025 February 23

Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష(Group 2 Mains) రాయనున్నారు.

  • Author : Pasha Date : 12-11-2024 - 9:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Appsc Group 2 Mains Exam Postponed Andhra Pradesh

Group 2 Mains : ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసింది. 2025  జనవరి 5న జరగాల్సిన ఈ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌ కుమార్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. సిలబస్​లో మార్పులు జరిగినందున పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యేందుకు ఇంకొంత సమయం ఇవ్వాలని ఏపీపీఎస్సీని ఇటీవలే పలువురు అభ్యర్థులు కోరారు.

Also Read :Army Helpline : సైనికులు, మాజీ సైనికుల కోసం.. ఆర్మీ హెల్ప్ లైన్ 155306

ఈ కారణం వల్లే పరీక్ష తేదీని మార్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష(Group 2 Mains) రాయనున్నారు. గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష రాసే అభ్యర్థుల్లో కొంతమంది డీఎస్సీ ఎగ్జామ్‌కు కూడా హాజరవుతారు. అలాంటి వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తొలుత గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్‌కు జనవరి 5వ తేదీని ఫిక్స్ చేశారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో జనవరి 5న రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించాలని భావించారు. అయితే గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి  పరీక్ష రాసేందుకు కనీసం మూడు నెలల టైం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ రిక్వెస్టును టీడీపీ ప్రభుత్వం సానుకూలంగా పరిగణించింది. అభ్యర్థుల ప్రయోజనార్ధం పరీక్ష తేదీని ఫిబ్రవరి 23కు వాయిదా వేసింది.

Also Read :Train Owner : ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్‌ అయిన రైతు.. ఎలా అంటే ?

ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ టెస్టులు.. న్యూ అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నిర్వ‌హించే డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వ‌హ‌ణ‌కు ఏపీపీఎస్‌సీ రెడీ అయింది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.  దరఖాస్తులను సమర్పించేందుకు అభ్యర్థులకు డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు అవకాశాన్ని కల్పించింది. డిసెంబ‌ర్ 18 నుంచి 23 వ‌ర‌కు డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వ‌హిస్తామని  వెల్లడించింది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఈ పరీక్షలకు అప్లై చేసుకోనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితే వారి కెరీర్‌ జర్నీలో ప్లస్ పాయింటుగా మారుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • APPSC
  • APPSC Group 2
  • Group 2
  • Group 2 Mains
  • jobs
  • Mains Exam Postponed

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

Latest News

  • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

  • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

  • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

  • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

  • రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!

Trending News

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd