HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >130 Nukes Facing You Pakistan Minister Threatens India

130 Nukes Warning: భారత్‌పై దాడికి 130 అణు బాంబులు: పాక్‌ మంత్రి

భారత్‌(130 Nukes Warning) కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టుగా భావిస్తాం.

  • Author : Pasha Date : 27-04-2025 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
130 Nukes Warning Nuclear Warheads pakistan India Vs Pakistan Pahalgam Attack

130 Nukes Warning : పాకిస్తాన్ ప్రభుత్వంలోని మంత్రులు, కీలక నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. భారత్‌పై ఎడాపెడా నోరు పారేసుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా సూపర్ పవర్ భారత్‌కే వార్నింగ్ ఇచ్చాడు. ‘‘భారత్‌పై దాడి చేసేందుకే 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచాం’’ అని బహిరంగ బెదిరింపులకు దిగాడు. ‘‘భారత్‌పై వేసేందుకు ఘోరీ, షాహీన్‌, ఘజ్నవి క్షిపణులు కూడా తీసి ఉంచాం. భారత్‌ సింధూ జలాలను నిలిపివేస్తే, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. పాక్‌ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చాం. భారత్‌(130 Nukes Warning) కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నట్టుగా భావిస్తాం. మా దగ్గరున్న ఆయుధాలు, క్షిపణులు ప్రదర్శన కోసం కాదు. అవి భారత్‌నే లక్ష్యంగా చేసుకుంటాయి’’ అని హనీఫ్‌ అబ్బాసీ కామెంట్స్ చేశారు.

Also Read :POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్

ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధమే : హనీఫ్‌ అబ్బాసీ 

‘‘పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలను భారత్ ఇప్పటికే అర్థం చేసుకుంది. మేం రెండు రోజులు గగనతలం మూసేస్తే భారత వైమానిక రంగం తీవ్ర గందరగోళంలో కూరుకుపోయింది. మరో 10 రోజులు మేం ఇలానే చేస్తే ఏకంగా భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయి. ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేమూ సిద్ధమవుతున్నాం’’ అని పాకిస్తాన్ మంత్రి హనీఫ్‌ అబ్బాసీ వ్యాఖ్యానించారు.

Also Read :ED Office Fire: ఈడీ ఆఫీసు భవనంలో భారీ అగ్నిప్రమాదం

వాళ్ల కోసమే చెత్తపనులు చేశాం : పాక్‌ రక్షణ మంత్రి 

‘‘అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే గత మూడు దశాబ్దాలుగా మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో చేరకపోయి ఉంటే,  మాకు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది. పాక్‌లోని గత ప్రభుత్వాలు తప్పులు చేశాయని భావిస్తున్నాను’’ అని ఇటీవలేే పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 130 Nukes Warning
  • india
  • India vs Pakistan
  • Nuclear Warheads
  • Nuclear Warning
  • Pahalgam Attack
  • pakistan

Related News

Union Minister Rajnath Singh

Rajnath Singh: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్‌

ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సింధు నది జలాలు అందకుండా చేస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ శాఖ నిర్వహించిన ‘మేధావుల సదస్సు’లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి, సామరస్య భాష అర్థం చేసుకోని వారికి ఎలా బదులివ్వాలో ‘ఆపరేషన్ సిందూ

    Latest News

    • Indriya – Aditya Birla Jewellery : భారతీయ సంస్కృతి అద్దంపట్టేలా ‘ఇంద్రియ’ అద్భుత ఆవిష్కరణ

    • Amazon : అమెజాన్‌లో జోరుగా టూ-వీలర్ సేల్స్!

    • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుకూలించని వాతావరణం

    • Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి

    • TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

    Trending News

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd