Exam Centre : పరీక్ష హాల్ లో అభ్యర్థి హాల్ టికెట్‌ను ఎత్తుకెళ్లిన గద్ద
Exam Centre : అభ్యర్థి చేతిలో ఉన్న హాల్ టికెట్‌ను గద్ద ముక్కుతో లాక్కుని ఎగిరిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది
- By Sudheer Published Date - 12:44 PM, Fri - 11 April 25

కేరళలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (KPSC) పరీక్ష సందర్భంగా ఒక అభ్యర్థి(Candidate)కి ఊహించని ఘటన ఎదురైంది. కాసరగోడ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పరీక్షకు హాజరవ్వడానికి వచ్చిన అభ్యర్థి, ఉదయం 7:30 గంటల సమయంలో పరీక్ష కేంద్రం వద్ద హాజరయ్యాడు. హాల్ టికెట్‌ను పక్కన ఉంచుకుని ప్రశాంతంగా కూర్చున్న అతనిపై ఆకస్మికంగా ఓ గద్ద (Egale ) దాడిచేసింది. అభ్యర్థి చేతిలో ఉన్న హాల్ టికెట్‌ను గద్ద ముక్కుతో లాక్కుని ఎగిరిపోవడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది.
Tahawwur Ranas Lawyer: ఉగ్రవాది తహవ్వుర్ రాణా తరఫు న్యాయవాది ఎవరు?
హాల్ టికెట్ తీసుకోని గద్ద సెంటర్ భవనం పైకెగిరి ఓ కిటికీపై కూర్చుని చేసిన తీరు, అక్కడ ఉన్న సిబ్బందితో పాటు మిగతా అభ్యర్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. గద్ద తన కాళ్లతో టికెట్‌ను పట్టుకుని ప్రశాంతంగా కూర్చుని చుట్టూ చూస్తుండిపోయింది. పరీక్ష కేంద్ర సిబ్బంది వెంటనే స్పందించి గద్దను భయపెట్టి హాల్ టికెట్‌ను కింద పడేసేలా చేశారు. వెంటనే టికెట్‌ను అభ్యర్థికి తిరిగి అందించారు. ఈ సంఘటనపై అక్కడే ఉన్నవారు తలదించుకుని నవ్వుకున్నారు.
Hanuman : హనుమంతుడు లేని రామయ్య గుడి ఎక్కడో ఉందో తెలుసా..?
ఈ ఘటనతో కాసేపు అభ్యర్థి గందరగోళానికి లోనయ్యాడు. హాల్ టికెట్ లేకపోతే పరీక్ష రాయలేనన్న ఆందోళనతో బెంబేలెత్తిపోయాడు. అయితే పరీక్ష కేంద్ర సిబ్బంది చురుకుగా వ్యవహరించి టికెట్‌ను తిరిగి అందించి పరీక్షకు అనుమతి ఇచ్చారు. చివరికి అభ్యర్థి పరీక్షను రాయగలిగాడు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరికీ నవ్వు తెప్పిస్తున్నా, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ డాక్యుమెంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సంఘటన చక్కటి గుణపాఠంగా నిలుస్తోంది.
హాల్‌టికెట్‌తో తుర్రుమన్న గద్ద
కేరళలో పబ్లిక్ సర్వీస్ కమిషన్(KPSC) పరీక్ష రాసే అభ్యర్థికి ఓ వింత ఘటన ఎదురైంది. కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం 7:30 గంటలకు సెంటర్ వద్ద అభ్యర్థి హాల్ టికెట్‌ను పక్కన పెట్టుకోని కూర్చున్నాడు. ఇంతలో ఒక గద్ద వచ్చి అభ్యర్థి హాల్… pic.twitter.com/z5LtMRUnfc
— ChotaNews App (@ChotaNewsApp) April 10, 2025